Telugu News » Cyber Crime : వాహనదారులు బీ అలర్ట్.. చలాన్లు వైబ్ సైట్లలో కట్టొద్దు..!!

Cyber Crime : వాహనదారులు బీ అలర్ట్.. చలాన్లు వైబ్ సైట్లలో కట్టొద్దు..!!

నకిలీ వైబ్ సైట్లలో చలాన్లు కట్టొదని తెలియచేస్తున్నారు.. మరోవైపు రాష్ట్రంలో లక్షల్లో పేరుకుపోయిన చలాన్లను క్లియర్ చెయ్యటానికి ప్రభుత్వం ఇటీవల డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే.

by Venu

సైబర్ క్రైమ్ (Cyber Crime).. ప్రస్తుతం అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పదం.. వివిధ దారులలో అడ్డగోలుగా దోచుకొంటున్న, సైబర్ నేరగాళ్లు (Cyber ​​Criminals) చేస్తున్న క్రైమ్ వల్ల.. ఉన్నత అధికారులతో పాటు.. సామాన్యులు సైతం బాధితుల్లా మారిన సందర్భాలు ఉన్నాయి.. ఒక దారి మూసుకుపోతే టెక్నాలజీ సాయంతో మరోదారి సృష్టించుకోవడంలో సైబర్ నేరగాళ్లు ఆరితేరారు.. ఈ క్రమంలో పెండింగ్ చలాన్ల (Pending Challans) క్లియరెన్స్ కోసం ప్రభుత్వం ప్రకటించిన డిస్కౌంట్ ఆఫర్‌ పై కన్నేశారు..

ఇందులో భాగంగా సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్ సైట్లను క్రియేట్ చేసి డబ్బులు కొల్లగొడుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీస్ అధికారులు వాహనదారులను హెచ్చరిస్తున్నారు. కాగా కేటుగాళ్లు https ://echallantspolice.in/ అన్న పేరుతో నకిలీ వెబ్ సైట్‌ను రూపొందించారు. దీని ద్వారా చలాన్లు వసూలు చేస్తూ వాహనదారుల జేబులు కొల్ల కొడుతున్నారు. ఇంటర్ నెట్‌లో నకిలీ వెబ్ సైట్లను గుర్తించిన అధికారులు సోషల్ మీడియా ద్వారా వాహనదారులను అప్రమత్తం చేశారు.

నకిలీ వైబ్ సైట్లలో చలాన్లు కట్టొదని తెలియచేస్తున్నారు.. మరోవైపు రాష్ట్రంలో లక్షల్లో పేరుకుపోయిన చలాన్లను క్లియర్ చెయ్యటానికి ప్రభుత్వం ఇటీవల డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మీ సేవా సెంటర్లతో పాటు https://echallan.tspolice.gov.in/publicview/ అన్న పేరుతో వెబ్ సైట్‌ను అధికారులు అందుబాటులోకి తెచ్చారు. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రకటించిన డిస్కౌంట్ ఆఫర్‌కు వాహనదారుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది.

You may also like

Leave a Comment