Telugu News » అల్లు అరవింద్ వల్ల ఉదయ్ కిరణ్ చెయ్యి జారిపోయిన ఆ హిట్ సినిమా ఏదో తెలుసా..?

అల్లు అరవింద్ వల్ల ఉదయ్ కిరణ్ చెయ్యి జారిపోయిన ఆ హిట్ సినిమా ఏదో తెలుసా..?

by Sravya
Udaykiran-Movie

దివంగత నటుడు ఉదయ్ కిరణ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఉదయ్ కిరణ్ కెరియర్ మొదట్లో పలు సినిమాల్లో నటించి పాపులర్ అయిపోయారు. సినీ కెరియర్ని స్టార్ట్ చేసిన కొన్నాళ్ళకి మంచి పేరుని తెచ్చుకుని మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. కానీ చిన్న వయస్సులోనే ఉదయ్ కిరణ్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికి కూడా ఉదయ్ కిరణ్ కి సంబంధించిన వార్తలు ఎన్నో మనకి కనబడుతూ ఉంటాయి. ఉదయ్ కిరణ్ మరణానికి సంబంధించి ఎవరికి తోచిన విషయాలని వాళ్ళు చెప్తూ ఉంటారు ఎవరు ఎన్ని కారణాలు చెప్పినా వాస్తవం ఏంటనేది కేవలం ఉదయ్ కిరణ్ కి మాత్రమే తెలుసు.

ఉదయ్ కిరణ్ చనిపోయినప్పటి నుండి కూడా ఎన్నో వార్తలు ఆయన మరణం పై వచ్చాయి సోషల్ మీడియా సైతం ఎవరికి నచ్చినట్లు వాళ్ళు రాస్తూ ఉంటారు. తనతో పని చేసిన తోటి నటీనటులు, దర్శకులు కూడా మీడియాతో పలు విషయాలని పంచుకుంటూనే ఉన్నారు తాజాగా ఇంటర్వ్యూలో మురళీమోహన్ ఉదయ్ కిరణ్ కి సంబంధించిన విషయాన్ని చెప్పడం జరిగింది. మురళీమోహన్ చెప్పిన దాని ప్రకారం ఉదయ్ కిరణ్ అతడు సినిమాకు హీరోగా చేయాలని మురళీమోహన్ భావించాడట. ఆ విషయం ఉదయ్ కిరణ్ తో ప్రస్తావించగా సినిమా చేయడానికి సిద్ధమంటూ మాట ఇచ్చారట. స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేయడానికి కొంత టైం పట్టింది. ఈలోపు ఉదయ్ కిరణ్ చిరంజీవి కూతురు సుష్మితతో వివాహం నిశ్చయమైంది.

Also read:

ఉదయ్ కి సంబంధించిన అన్ని వ్యవహారాలు కూడా అరవింద్ దగ్గర నుండి చూసుకునేవారట ఉదయ్ కిరణ్ డేట్స్ కి సంబంధించిన డైరీ ని కూడా అల్లు అరవింద్ తన దగ్గరే పెట్టుకునే వారట. ఎవరికి ఏ సినిమా ఒప్పుకోవాలి..? ఎవరితో సినిమా చేయాలి అనేవి అన్నీ కూడా అరవింద్ చేసుకునేవారట. అంతకుముందే అతడు సినిమా ఒప్పుకున్నాడు. కాబట్టి మురళీమోహన్ వెళ్లి ఉదయ్ కిరణ్ డేట్స్ అడగగా ఖాళీ లేవని అరవింద్ చెప్పారట ఉదయ్ కిరణ్ ఈ విషయంలో ఏమీ చేయలేకపోయాడని మురళీమోహన్ అన్నారు. దీంతో అతడు సినిమా మహేష్ బాబు చేతి కి వెళ్ళింది పెళ్లి క్యాన్సిల్ అయిన తర్వాత కెరియర్ పూర్తిగా పాడైందని వచ్చిన అవకాశాలు అన్నీ కూడా పోయాయని మురళీమోహన్ చెప్పారు.

You may also like

Leave a Comment