Telugu News » Deep Fake Video: టార్గెట్ రష్మిక మందన్న.. మరో డీప్ఫేక్ వీడియో వైరల్..!

Deep Fake Video: టార్గెట్ రష్మిక మందన్న.. మరో డీప్ఫేక్ వీడియో వైరల్..!

రష్మికకు సంబంధించిన మరో ఫేక్ వీడియోను దుండగులు సోషల్ మీడియాలో వదిలారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

by Mano
Deep Fake Video: Target Rashmika Mandanna.. Another Deep Fake Video Viral..!

నేషనల్ క్రష్(National Crush) రష్మిక మందన్న(Rashmika Mandanna)కు డీప్ ఫేక్ వీడియోల తిప్పలు తప్పడంలేదు. ఇటీవలే ఆమెకు సంబంధించిన డీప్ ఫేక్ వీడియోలు(Deep Fake Videos) వైరల్ అయిన విషయం తెలిసిందే. దీంతో టాలీవుడ్‌లోనే కాదు.. దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

Deep Fake Video: Target Rashmika Mandanna.. Another Deep Fake Video Viral..!

అయితే ఆ వీడియోల నుంచి బయటపడి యానిమల్‌ సినిమా హిట్‌తో ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది రష్మిక. ఈ క్రమంలో రష్మికకు సంబంధించిన మరో ఫేక్ వీడియోను దుండగులు సోషల్ మీడియాలో వదిలారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ఇందులోనూ ఏఐ(ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్) ద్వారా ఆమె ముఖాన్ని మార్ఫింగ్‌ చేసినట్లు తెలుస్తోంది. మరో వీడియో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో నెటిజన్లు దుండగులపై దుమ్మెత్తిపోతున్నారు. ఇలాంటివి ఆపాలని డిమాండ్‌ చేస్తున్నారు. అదే సమయంలో ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

రష్మికకు సంబంధించిన ఫేక్ వీడియోలు ఇటీవల వరుసపెట్టి విడుదలవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మరి వీటిపై అధికారులు, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ప్రస్తుతం ఈ నేషనల్ క్రష్ మరో సారి శ్రీవల్లిగా సందడి చేయడానికి రెడీ అయింది. పుష్ప2 షూటింగ్‌లో బిజీ అయిపోయింది. అదేవిధంగా ది గర్ల్ ఫ్రెండ్, రెయిన్‌ బో సినిమాలతో పాటు యానిమల్‌ పార్క్‌ సినిమాలో నటించనుంది.

You may also like

Leave a Comment