తెలంగాణ (Telangana) రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకొంటున్నాయి. ఒకవైపు లోక్ సభ ఎన్నికల హడావుడి.. ఈ క్రమంలో ప్రధాన పార్టీలన్ని ప్రచార పర్వాన్ని మొదలుపెట్టి.. అత్యధికంగా ఎంపీ స్థానాలే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ (BJP) సైతం మెజార్టీ సీట్లు గెలుచు కునేందుకు క్షేత్రస్థాయిలో కసరత్తు మొదలుపెట్టగా.. ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM MOdi) స్వయంగా రంగంలోకి దిగారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీ తెలంగాణలో పర్యటిస్తున్నారు. నిన్న హైదరాబాద్ (hyderabad), మీర్జాల్ గూడా నుంచి మల్కాజ్‌గిరి వరకు రోడ్ షో నిర్వహించారు.. అయితే ఓవైపు ప్రధాని రోడ్ షో నిర్వహిస్తున్న సమయంలో.. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam) కేసులో బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసంపై ఈడీ, ఐటీ (IT) అధికారులు రెయిడ్స్ చేయడమే కాకుండా.. అరెస్ట్ కూడా చేయటం ఇప్పుడు సర్వత్రా సంచలనాన్ని క్రియేట్ చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారంటూ.. సుమారు ఐదు గంటల పాటు సోదాలు నిర్వహించిన అధికారులు.. ఆమె దగ్గరున్న ఫోన్లు సీజ్ చేసి.. అరెస్ట్ వారెంట్ కూడా ఇచ్చేసి.. అదుపులోకి తీసుకొన్నారు. అయితే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సోసిడియాతో పాటు మరికొందరు కూడా అరెస్ట్ అయ్యారు.
మరోవైపు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖు పేర్లు కూడా ఈ కేసులో వెలుగులోకి వచ్చాయి. ఇందులో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)పేరు తెరపైకి వచ్చింది. సౌత్ గ్రూప్ ను లీడ్ చేయటంలో కవిత కీలకంగా వ్యవహరించారంటూ తీవ్ర ఆరోపణలు చుట్టూ ముట్టాయి. అలా రెండేళ్లకుపైగా కవిత చుట్టూ తిరుగుతున్న ఈ కేసులో ఈడీ చివరకు కీలక నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కవితను అరెస్ట్ చేసిందని అంటున్నారు..
ఈ కేసులో అమిత్ ఆరోరోను సీబీఐ అరెస్ట్ చేసింది. అదేసమయంలో మద్యం పాలసీ రూపకల్పనలో ప్రైవేటు వ్యక్తులు ఉన్నారని విషయాన్ని గుర్తించిన సీబీఐ. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో తొలిసారిగా కవిత పేరును ప్రస్తావించింది. ఆ తర్వాత ఈడీ (ED) కూడా ఈ కేసులోకి ఎంట్రీ ఇచ్చింది. వంద కోట్ల రూపాయల ముడుపులను సౌత్ గ్రూప్ (South Group) చెల్లించినట్లు సీబీఐ తేల్చింది. సౌత్ గ్రూప్ ను నియంత్రించింది శరత్ రెడ్డి, కవిత, వైసీపీ ఎంపీ మాగుంట అని ఈడీ పేర్కొంది. సౌత్ గ్రూప్ ద్వారా వంద కోట్లను విజయ్ నాయర్ కు చేర్చినట్టుగా ఈడీ వెల్లడించింది.
ఈ కేసులో 36 మంది రూ.1.38 కోట్ల విలువైన 170 మెుబైల్ ఫోన్లు ధ్వంసం చేశారని తెలిపింది. వీటిలో కవిత రెండు నెంబర్లు, పది మెుబైల్ ఫోన్ల్ వాటినట్లు పేర్కొంది. ఆమె వాడిన పది ఫోన్లు ఆధారాలు దొరకకుండా ధ్వంసం చేశారని రిమాండ్ రిపోర్టులో ఈడీ తెలిపింది. వంద కోట్లను అమిత్ అరోరా ద్వారా విజయ్ నాయర్‌కు చేర్చినట్టుగా ఈడీ పసిగట్టింది. అరోరా కూడా ఈ విషయాన్ని అంగీకరించారని పేర్కొంది.
అదీగాక వైసీపీ ఎంపీ (YSRCP MP) మాగుంట శ్రీనివాసులరెడ్డి కూడా ఇందులో సూత్రధారిగా ఉన్నారని వెల్లడించింది. ఇక సౌత్ గ్రూప్ నుంచి ముడుపులు చెల్లించిన వారిలో.. అరబిందో శరత్ రెడ్డి (Sarath Reddy)తో పాటు కవిత పేరును ఈడీ అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. సౌత్ గ్రూప్ లో కీలకంగా ఉన్నట్లు గుర్తించిన వ్యాపారవేత్త అరుణ్ పిళ్లై మరియు అభిషేక్ బోయిన్‌పల్లి మరియు చార్టర్డ్ అకౌంటెంట్ బుచ్చిబాబును అదుపులోకి తీసుకుని విచారించి వీరి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు ఈడీ పేర్కొంది.
అయితే ఈ కేసులో నిందితులుగా ఉన్న పలువురు ఇప్పటికే అప్రూవర్లుగా మారారు. దీంతో దర్యాప్తు సంస్థలకు కీలక సమాచారం అందింది. దీని ఆధారంగా కవితను అరెస్ట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అదేవిధంగా కవిత అరెస్ట్ ప్రీ ప్లానా తో కానీ, కో ఇన్సిడెన్స్ కానీ జరిగింది కాదని.. పూర్తిగా ఆధారాలు సేకరించాకే ఈడీ ఈ నిర్ణయానికి వచ్చినట్లు చర్చించు కొంటున్నారు. ఒకవేళ అలా ఇబ్బంది పెట్టాలనుకొంటే.. ఆ పని ఎప్పుడో చేసేవారని అంటున్నారు. ఇంత కాలం అధికారం అడ్డుపెట్టుకొని కేసును ఇన్ని సంవత్సరాలుగా ముందుకు నడిపించారని.. అసలు కవిత తప్పు చేయకపోతే బయపడవలసిన అవసరం ఏముందనే మాటలు కూడా వినిపిస్తున్నాయి..