Telugu News » IPL 2024: ‘భారతీయులెవరికీ అలాంటి కల లేదు..’ పాక్ అభిమానికి హర్భజన్ కౌంటర్..!

IPL 2024: ‘భారతీయులెవరికీ అలాంటి కల లేదు..’ పాక్ అభిమానికి హర్భజన్ కౌంటర్..!

ఐపీఎల్‌లో పాకిస్థాన్ ప్లేయర్లు ఆడితే బాగుంటుందంటూ ఓ పాక్ అభిమాని తన మనసులోని కోరికల చిట్టాను సోషల్ మీడియా వేదికగా బయటపెట్టాడు. ఎక్స్(X) వేదికగా అభిమాని ఇలా రాసుకొచ్చాడు.

by Mano
IPL 2024: 'No Indian has such a dream..' Harbhajan's counter to Pakistan fan..!

భారత టీ20 టోర్నీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఐపీఎల్-2024 మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. అయితే భారత టీ20(T20) లీగ్‌లో పాకిస్థాన్ ప్లేయర్ల(PAK Players)కు అనుమతి లేని సంగతి తెలిసిందే. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతల కారణంగా పాక్ ఆటగాళ్లపై ఐపీఎల్‌లో ఆడకుండా నిషేధం విధించారు.

IPL 2024: 'No Indian has such a dream..' Harbhajan's counter to Pakistan fan..!

తొలి సీజన్ 2008లో మాత్రమే పాక్ ప్లేయర్లకు ఐపీఎల్‌లో అవకాశం దక్కింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో పాకిస్థాన్ ప్లేయర్లు ఆడితే బాగుంటుందంటూ ఓ పాక్ అభిమాని తన మనసులోని కోరికల చిట్టాను సోషల్ మీడియా వేదికగా బయటపెట్టాడు. ఎక్స్(X) వేదికగా అభిమాని ఇలా రాసుకొచ్చాడు.

‘పాక్ ప్లేయర్లు భారత టీ20 టోర్నీలో ఆడితే చూడాలనుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)లో విరాట్ కోహ్లితో పాటు బాబర్ అజామ్ ఆడితే చూడాలి. ఇంకా.. షాహిన్ అఫ్రిదీ, జస్రీత్ బుమ్రా కలిసి ముంబై ఇండియన్స్‌కు ఆడాలి. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఎంఎస్ ధోనీతో మొహ్మద్ రిజ్వాన్ ఉంటే బాగుంటుంది.’ అంటూ పేర్కొన్నాడు.

ఇది భారత్, పాకిస్తాన్ క్రికెట్ అభిమానుల కల అంటూ పలు జెర్సీల్లో క్రియేట్ చేసిన ఫొటోలను పాక్ అభిమాని షేర్ చేశాడు. అతడి ట్వీట్‌కు టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. ‘భారతీయులెవరికీ అలాంటి కల లేదు. ముందుగా మీరు కలలు కనడం ఆపండి. మేల్కొనండి బాయ్స్’ అంటూ పాక్ అభిమానికి బజ్జీ కౌంటర్ ఇచ్చాడు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

You may also like

Leave a Comment