Telugu News » Dhanashree Verma: ట్రోలర్స్‌పై చాహల్ భార్య ఆగ్రహం.. !

Dhanashree Verma: ట్రోలర్స్‌పై చాహల్ భార్య ఆగ్రహం.. !

ట్రోల్స్ కారణంగా తన ఫ్యామిలీ ప్రభావితమవుతోందని చాహల్ భార్య ధనశ్రీ తెలిపింది. అందుకే సోషల్ మీడియాకు కొంతకాలం విరామం ఇస్తున్నట్లు ప్రకటించింది.

by Mano
Dhanashree Verma: Chahal's wife angry with trollers.. !

భారత జట్టు స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్(Yuzvendra Chahal), అతడి భార్య ధనశ్రీ వర్మ(Dhanashree Verma) గురించి తెలిసిందే. వీరిద్దరూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తరచూ ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. చాహల్ భార్య ధన శ్రీ ప్రముఖ డ్యాన్సర్. అయితే ఆమె ఇటీవల ఓ డ్యాన్స్ రియాల్టీ షోలో పాల్గొంది.

Dhanashree Verma: Chahal's wife angry with trollers.. !

ఆ సమయంలో ఆమె తన కొరియోగ్రాఫర్ ప్రతీక్ ఉటేకర్‌తో కలిసి ఉన్న ఫొటోను సోషల్ మీడియా(social media)లో అప్‌లోడ్ చేసింది. దీంతో ఆమెపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేశారు నెటిజన్లు. ఆ ఫొటోపై ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్లు పెట్టడం మొదలుపెట్టారు. దీంతో స్పందించిన ధనశ్రీ అలా కామెంట్లు చేస్తున్న వారికి దీటుగా సమాధానం చెప్పింది. తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది.

ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. ట్రోల్స్ కారణంగా తన ఫ్యామిలీ ప్రభావితమవుతోందని తెలిపింది. అందుకే సోషల్ మీడియాకు కొంతకాలం విరామం ఇస్తున్నట్లు ప్రకటించింది. ‘‘నేను నా జీవితంలో ఎప్పుడూ ట్రోల్స్, మీమ్స్‌ బారిన పడలేదు. కానీ ఈసారి అది నన్ను, నా కుటుంబాన్ని ప్రభావితం చేసింది. సోషల్ మీడియాలో అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి అందరికీ స్వేచ్ఛ ఉంది. అయితే, అది కుటుంబంపై ప్రభావం చూపుతుందనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారు.’’ అంటూ తెలిపింది.

అదేవిధంగా ‘‘ద్వేషాన్ని వ్యాప్తి చేసే వారు తమ ప్రతిభ, నైపుణ్యాలపై దృష్టి పెట్టాలి.. నేనూ మీ తల్లి, సోదరిలాంటి మహిళననే విషయాన్ని గుర్తుంచుకోండి. మీ అక్క, స్నేహితులు, భార్య అందరూ మహిళలు అనే విషయాన్ని మర్చిపోవద్దు.’’ అంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చింది. ధనశ్రీ ఫిట్‌నెస్ ట్రైనర్, కొరియోగ్రాఫర్, యూట్యూబర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. చాహల్, ధనశ్రీ వర్మల వివాహం 2020లో జరిగింది.

You may also like

Leave a Comment