Telugu News » Diabetes Symptoms: డయాబెటిస్ రాకముందే ఈ లక్షణాలు కనిపిస్తాయని మీకు తెలుసా..?

Diabetes Symptoms: డయాబెటిస్ రాకముందే ఈ లక్షణాలు కనిపిస్తాయని మీకు తెలుసా..?

నేటి కాలంలో షుగర్ వ్యాధి కామన్ గా మారిపోయింది. భారతదేశంలో రోజు రోజుకి మధుమేహ బాధితులు పెరుగుతున్నారు. డయాబెటిస్ (Diabetes) రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే డయాబెటీస్‌ రాకుండా ఉండాలంటే ముందుగా జీవనశైలిని మార్చుకోవలసిన అవసరం ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

by Venu

ప్రజల జీవన విధానంలో మార్పులు చోటు చేసుకోవడం వల్ల వారి ఆరోగ్యంలో కూడా ఎన్నో మార్పులు జరుగుతున్న విషయం గమనించే ఉంటారు.. నేటి కాలంలో ఆరోగ్యంగా ఉండటం కంటే ఆర్థికంగా ఉండటమే ముఖ్యమని భావిస్తుండటంతో రోగాల బారినపడి సంపాదిస్తున్న దాంట్లో సగం మందులకు ఖర్చు చేస్తున్నారు మనుషులు.

ఇక నేటి కాలంలో షుగర్ వ్యాధి కామన్ గా మారిపోయింది. భారతదేశంలో రోజు రోజుకి మధుమేహ బాధితులు పెరుగుతున్నారు. డయాబెటిస్ (Diabetes) రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే డయాబెటిస్ రాకుండా ఉండాలంటే ముందుగా జీవనశైలిని మార్చుకోవలసిన అవసరం ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఒకవేళ షుగర్ వస్తే దాని లక్షణాలు (Symptoms)ఎలా ఉంటాయనే అనుమానం వస్తుంది కదా.. అందుకే డయాబెటిస్ ప్రారంభంలో ఉండే లక్షణాల గురించి తెలుసుకుందాం.

ప్రీ-డయాబెటిస్ లక్షణాలు చాలా సాధారణంగా ఉంటాయి. డయాబెటిస్ ప్రారంభంలో ఆకలి పెరగడం.. లేదా ఆకలి తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అధిక దాహం, అలసట వంటి లక్షణాలు కూడా ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలియచేస్తున్నారు. ఈ లక్షణాలు ఏ రోగిలోనైనా చాలా ఆలస్యంగా బయటపడుతాయని.. వారు తెలుసుకునే సమయానికి టైప్ 2 డయాబెటిస్ వస్తుందని వైద్యులు అంటున్నారు..

ఒక్క సారి డయాబెటిస్ శరీరంలో చేరిందంటే.. ఆడ, మగ అనే తేడా లేకుండా హార్మోన్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది. వీటి వల్ల శరీరం అనేక మార్పులకి గురి అవుతుందని ఆరోగ్య నిపుణులు వెళ్లడిస్తున్నారు. ఇక మధుమేహం ఉన్న పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయి పడిపోతుందని, మహిళల్లో కూడా హార్మోన్ స్థాయిలు తగ్గి పలురకాల సమస్యలు ఎదురవుతాయని నిపుణులు అంటున్నారు.

మరోవైపు మధుమేహం ఉన్న వారు ఎలాంటి ఆహారం (Food) తీసుకోవాలో నిపుణులు తెలుపుతున్నారు.. డయాబెటిక్ పేషెంట్లు అన్ని పండ్లు తినవచ్చని, అయితే పీచు ఎక్కువగా ఉండే పండ్లను తీసుకుంటే మంచిదని వైద్యులు (Doctors) చెబుతున్నారు. ఆరెంజ్, కివీ, సీజనల్ ఫ్రూట్స్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తాయని అంటున్నారు.

ముఖ్యంగా డయాబెటిక్ ఉన్న పేషెంట్లు మద్యం తాగకూడదని (Do not drink alcohol) నిపుణులు హెచ్చరిస్తున్నారు.. అన్నం, బంగాళదుంపలు, డీప్ ఫ్రై చేసిన పదార్థాలు ఎక్కువగా తినకూడదని నిపుణులు అంటున్నారు. షుగర్ కంటెంట్ ఉన్న మామిడి, పైనాపిల్, సపోటా వంటి పండ్లను ఎక్కువగా తీసుకోకపోవడం మేలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక ప్రతిరోజు యోగా, వ్యాయామం, ధ్యానం చేయాలంటున్నారు..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ విషయాలు చెప్పడం జరిగింది.. వీటిని ప్రయత్నించే ముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి..

You may also like

Leave a Comment