హిట్టు సినిమా తీయడం అంటే చాలా కష్టమే. ఎందుకంటే ప్రేక్షకుల పల్స్ ఎలా ఉంటుందో అన్నిసార్లు ఊహించడం కష్టం. దీనితో కొందరు ఆల్రెడీ హిట్ అయిన సినిమాలనే మరో లాంగ్వేజ్ నుంచి తీసుకొచ్చి తెలుగులో రీమేక్ చేస్తూ ఉంటారు. అయితే కొందరు డైరెక్టర్లు మాత్రమే తమ సొంతంగా కంటెంట్ రాసుకుని.. సినిమాలో తమ సొంతంగా ఓ సోల్ ని క్రియేట్ చేస్తుంటారు. ఆ ఊహా ప్రపంచంలోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్లి.. ఓ మంచి సినిమా చూసిన అనుభూతిని మిగిల్చేలా చేస్తారు. రీమేక్ సినిమా అంటే ఆల్రెడీ చూసిన సినిమానే మరోసారి తీయడం. ఒకప్పటి సంగతి వేరు కానీ.. ఇప్పుడు ఓటిటిలు వచ్చాక ప్రేక్షకులు కూడా చాలా అప్ డేట్ అయ్యారు. అన్ని భాషల్లో సినిమాలను చూసేస్తున్నారు. దీనితో రీమేక్ ల హవాకు ప్రాధాన్యత తగ్గిందనే చెప్పొచ్చు. అయితే.. తమ కెరీర్ లో ఒక్క రీమేక్ కూడా లేని స్టార్ డైరెక్టర్స్ ఉన్నారు. వారెవరో ఇప్పుడే చూసేద్దాం.
సుకుమార్:
లెక్కల మాస్టర్ నుంచి డైరెక్టర్ గా మారిన సుకుమార్ తన సినిమాల్లో కూడా లెక్కలను గట్టిగ ఫాలో అవుతారు. రీమేక్ ను అస్సలు ఇష్టపడని సుకుమార్ తన సినిమాల విషయంలో కథనం బాగుండేలా, ప్రేక్షకులకు పజిల్స్ విసురుతూ.. వారిని ఆధ్యంతం ఎంటర్టైన్ చేసేస్తాడు. సుకుమార్ కెరీర్ లో ఇప్పటివరకు ఒక్క రీమేక్ కూడా లేదు.
రాజమౌళి:
రీమేక్ అన్న పదానికే ఆమడ దూరం పోయే రాజమౌళి కూడా వైవిద్యమైన సినిమాలతో అల్ ఇండియా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ పాన్ ఇండియా రేంజ్ కు ఎదిగారు. ఇక ఆయన కెరీర్ లో రీమేక్స్ చేయాల్సిన అవసరమే లేదు.
కొరటాల శివ:
రాజమౌళి, సుకుమార్ ల తరువాత ఆ స్థాయిలో రీమేక్స్ జోలికి వెళ్లకుండా సినిమాలు తీసే డైరెక్టర్ కొరటాల శివ. ఈయన కూడా తన సినిమాల్లో పాత్రలు వైవిధ్యంగా ఉండేలా చూసుకుంటారు. ఈయన కెరీర్ లో కూడా రీమేక్ సినిమాలు లేవు.