Telugu News » KTR : న్యూ లుక్ లో కేటీఆర్.. సినిమాల్లోకి ఎంట్రీ..?

KTR : న్యూ లుక్ లో కేటీఆర్.. సినిమాల్లోకి ఎంట్రీ..?

తెలుగు రాజకీయ నేతల్లో ఒకరైన కేటీఆర్.. ప్రత్యేకశైలితో మాట్లాడే మాటాలకు ఫ్యాన్స్ సైతం ఉన్నారు.. ఇక నిత్యం సోషల్ మీడియా వేదికగా ప్రజలకు అందుబాటులో ఉంటారు.

by Venu

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సోషల్ మీడియా (Social Media)లో చాలా యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే.. ఆయన ట్విట్టర్ (X) వేదికగానే చాలా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారనే టాక్ కూడా ఉంది. అదేవిధంగా కేసీఆర్ (KCR) తనయుడుగానే కాకుండా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకొన్నారు.

తెలుగు రాజకీయ నేతల్లో ఒకరైన కేటీఆర్.. ప్రత్యేకశైలితో మాట్లాడే మాటాలకు ఫ్యాన్స్ సైతం ఉన్నారు.. ఇక నిత్యం సోషల్ మీడియా వేదికగా ప్రజలకు అందుబాటులో ఉండే కేటీఆర్.. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను తన అభిమానులకు, బీఆర్ఎస్ (BRS) శ్రేణులకు తెలియజేస్తారని అనుకొంటారు.. ఈ క్రమంలో ఆయన నేడు న్యూ లుక్‌తో దర్శనమిచ్చారు.

క్లీన్ షేవ్ చేసుకొని సరికొత్త లుక్‌తో ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram)లో కేటీఆర్ పోస్టు చేశారు. దీంతో ఆయన అభిమానులు కామెంట్లతో రెచ్చిపోతున్నారు. కొందరు బాలీవుడ్ హీరోలా ఉన్నవంటూ కామెంట్ పెడుతుండగా.. వెంటనే సినిమాల్లోకి వచ్చేయండి అన్న అంటూ మరికొందరు ట్రోలింగ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా కొద్ది రోజుల క్రితం కేటీఆర్‌ అభిమాని ఒకరు ఏఐ టెక్నాలజీ ద్వారా ఆయన కొత్త లుక్‌లో రూపొందించారు. పొడవాటి జట్టు, గడ్డం, మీసంతో ఎడిట్‌ చేసి కేటీఆర్‌కు పంపించాడు. ఆ ఫొటోను తన అధికారిక ఎక్స్‌లో కేటీఆర్‌ షేర్‌ చేశారు. దీంతో అదికాస్త వైరల్‌గా మారిన విషయం తెలిసిందే..

You may also like

Leave a Comment