యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఈగల్’ సినిమా తో మాస్ మహారాజ్ రవితేజ వచ్చేసాడు. ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయ్యింది. రవితేజ సరసన ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ నటించారు. నవదీప్, వినయ్ రాయ్, అవసరాల శ్రీనివాస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమా కి దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. వివేక్ కూచిబొట్ల సహ నిర్మాతగా పని చేసారు. అలానే ఈ సినిమా కి కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ ని అందించారు.
నటినటులు: రవితేజ, అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ నవదీప్, వినయ్ రాయ్, అవసరాల శ్రీనివాస్ తదితరులు
దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని
రిలీజ్ డేట్: 09-02-2023
కథ మరియు విశ్లేషణ :
ఒక అడవి ప్రాంతంలో రవితేజ ఉంటూ ఉంటాడు. చుట్టుపక్కల అన్యాయం జరిగితే అస్సలు ఊరుకోడు. తన అనుకునే వారిని ఎప్పుడు కూడా రవితేజ కాపాడుకుంటూ బతుకుతూ ఉంటాడు. ఇలాంటప్పుడే పోలీసులు రవితేజని అడవి నుంచి బయటికి తీసుకురావాలి చూస్తారు. కొన్ని స్ట్రింగ్ ఆపరేషన్స్ కూడా చేపడతారు. ఈ సమయం లో రవితేజ అడవి నుంచి బయటకి వచ్చాడంటే.. అరెస్టు చేయాలని పోలీస్ లు అనుకుంటారు. రవితేజ కోసం పోలీస్లు అసలు ఎందుకు వెతుకుతున్నారు, తనేం చేసాడు..? గత చరిత్ర ఏంటి అనే సస్పెన్స్ తో సీన్స్ వున్నాయి. ఈ కథ మొత్తం తెలియాలంటే సినిమా ని చూడవలసిందే. డైలాగులను , సాంగ్స్ డిజైన్ చేయించుకున్న విధానం అదిరింది.
కార్తీక్ ఘట్టమనేని ఎంచుకున్న స్టోరీ సూపర్ అసలు. ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసే విధం గానే మూవీ అయితే ఉంది. అయితే ఈ సినిమా లో కథపరంగా అక్కడక్కడా కొంచెం లూప్ హోల్స్ వున్నాయి కానీ రవితేజ నటన తో అవేమి పెద్దగా కనపడలేదు. కొన్ని సీన్లలో రవితేజ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఫస్టాఫ్ లో చూస్తే కామెడీ, యాక్షన్ ఎపిసోడ్స్ తో బావుంది. సెకండ్ హాఫ్ లో అసలైన స్టోరీ వుంది. అలానే ప్రతి క్యారెక్టర్ కి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చారు.
Also read:
ప్లస్ పాయింట్స్:
రవితేజ నటన
డైరెక్షన్
యాక్షన్ సీన్స్
మైనస్ పాయింట్స్:
కథ లో లూప్ హోల్స్
రేటింగ్: 2.75/5