Telugu News » US university: అమెరికాలో ప్రొఫెసర్‌ కాల్చివేత!

US university: అమెరికాలో ప్రొఫెసర్‌ కాల్చివేత!

నార్త్ కరోలినా యూనివర్శిటీలో సోమవారంనాడు జరిగిన కాల్పుల్లో ఓ ప్రొఫెసర్ మృతి చెందాడు.

by Sai
firing at us university proffessor dies

అమెరికాలోని నార్త్ కరోలినా యూనివర్శిటీ (us university) లో సోమవారంనాడు కాల్పులు చోటు చేసుకున్నాయి.ఈ కాల్పుల్లో యూనివర్శిటీలో పనిచేసే అధ్యాపకుడు మృతి చెందారు.ఈ ఘటనకు సంబంధించి ఓ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యూనివర్శిటీ ఆఫ్ నార్త్ కరోలినా సంఘం క్యాంపస్ లో జరిగిన హింసాత్మక చర్యలతో ఓ అధ్యాపకుడు మృతి చెందినట్టుగా ఆ సంస్థ వీసీ గుస్కీవిచ్ ఓ ప్రకటనలో తెలిపారు.

firing at us university proffessor dies

నార్త్ కరోలినా యూనివర్శిటీలో సోమవారంనాడు జరిగిన కాల్పుల్లో ఓ ప్రొఫెసర్ మృతి చెందాడు. ఈ ఘటనకు పాల్పడినట్టుగా అనుమానిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం నాడు మధ్యాహ్నం నార్త్ కరోలినా క్యాంపస్ (us university) లోని చాపెల్ హిల్ వద్ద కాల్పులు జరిగినట్టు పోలీసులకు సమాచారం అందిందని వీసీ తెలిపారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వీసీ చెప్పారు. ఈ ఘటన జరిగిన రెండు ఘటనల తర్వాత క్యాంపస్ ను జల్లెడ పట్టి ఆల్ క్లియర్ ను పోలీసులు జారీ చేశారు.

తక్షణ ముప్పు లేదని పోలీసులు వివరించారని వీసీ ప్రకటించారు. స్టాండ్ ఆఫ్ సమయంలో క్యాంపస్ చుట్టూ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మరణించిన అధ్యాపకుడు, అనుమానితుడి గుర్తింపును అధికారులు వెల్లడించలేదు.ఈ నెల 28, 29 తేదీల్లో యూనివర్శిటీలో జరగాల్సిన క్లాసులను, ఈవెంట్లను రద్దు చేసినట్టుగా వీసీ వివరించారు.

విశ్వ విద్యాలయంలో సుమారు 4,100 అధ్యాపకులు, 9 వేల మంది సిబ్బందితో పాటు 32 వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.నార్త్ కరోలినా గవర్నర్ రాయ్ కూపర్ సోమవారం నాడు మాట్లాడారు. విశ్వవిద్యాలయ క్యాంపస్ ను రక్షించడానికి అవసరమైన అన్ని చర్యలను చేపట్టినట్టుగా కూపర్ తెలిపారు.

You may also like

Leave a Comment