కరీంనగనర్ లో ఓ ఎలుగుబంటి(bear)కలకలం రేపింది. చిక్కని రాత్రిలో కలిసిపోయి అధికారులకు చిక్కకుండా స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. బంధించేటందుకు వచ్చిన రెస్క్యూ టీమ్(Rescue team) ను నానాతిప్పలు పెట్టింది.12 గంటల తీవ్ర వెతుకులాట అనంతరం..ఎట్టకేలకు ఎలుగు రేకుర్తి(Raykurthi)లో పట్టుబడింది.
కరీంనగర్ జిల్లా(Karimnagar District)బొమ్మకల్ (Bommakal) పంచాయతీ పరిధిలోని రజ్వీ చమాన్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి 11 ఎలుగుబంటి కాలనీలోకి వచ్చింది. దీంతో స్థానికులు.. భయంతో పరుగులు పెట్టారు. ద్వారకానగర్ లో కూడా ఎలుగు కనిపించిందని చెప్పారు స్థానికులు.
ద్వారక నగర్ లో ఎలుగుబంటి సంచరించిన విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఉదయం నగరంలోని పలు ప్రాంతాల్లో హల్చల్ చేసింది ఎలుగు. దీంతో స్థానికులు పోలీసులకు కంప్లైంట్ చేశారు.
అటవీ శాఖ సిబ్బంది వలలతో ఎలుగును పట్టుకునేందుకు తీవ్రంగా యత్నించారు. చివరకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి రేకుర్తిలో బంధించారు. కాసేపట్లో హైదరాబాద్ జూ పార్క్ కు తరలిస్తున్నట్లు చెప్పారు అధికారులు.