Telugu News » Ginger Side Effects : అల్లం ఎక్కువ వాడటం వల్ల ఎన్ని ప్రమాదాలో తెలుసా..?

Ginger Side Effects : అల్లం ఎక్కువ వాడటం వల్ల ఎన్ని ప్రమాదాలో తెలుసా..?

కూరల్లో అల్లం వాడకుంటే అసలు రుచి రాదు. అందుకే అల్లాన్ని వంటల్లో ఎక్కువగా వాడుతుంటాం. కానీ అల్లాన్ని అధికంగా వినియోగించడం వల్ల కొన్ని ఆరోగ్యపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

by Venu

ఆరోగ్యానికి అల్లం (Ginger)ఎంతో మేలు చేస్తుందని అందరికీ తెలుసు. వర్షకాలం (Rainy Season) చలికాలం (Winter Season)లో వచ్చే ఇన్ఫెక్షన్స్ నుంచి ఈ అల్లం రక్షణ కలిగిస్తుంది. దగ్గు (Cough) జలుబు (Cold)నుంచి కూడా ఈ అల్లం ఉపశమనం కలిగిస్తుంది. ఇక కూరల్లో అల్లం వాడకుంటే అసలు రుచి రాదు. అందుకే అల్లాన్ని వంటల్లో ఎక్కువగా వాడుతుంటాం. కానీ అల్లాన్ని అధికంగా వినియోగించడం వల్ల కొన్ని ఆరోగ్యపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.

శరీరంలోని జీర్ణవ్యవస్థను అల్లం ఉత్తేజ పరుస్తుంది. అయితే ఇది అందరి విషయంలో ఒకేలా ఉండదని నిపుణులు అంటున్నారు. మరోవైపు పరగడుపున అల్లం తీసుకుంటే మంచిదని చెబుతున్నారు.. కానీ పరగడుపున అల్లం తీసుకోవడం వల్ల జీర్ణాశయ సంబంధిత వ్యాధులతో పాటు గుండెలో మంట, డయేరియా లాంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. అందువల్ల అల్లాన్ని అధికంగా తీసుకోకపోవడమే ఉత్తమమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

శరీరంలో రక్తాన్ని పలుచగా చేసే గుణం అల్లానికి ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అదీగాక రక్త ప్రసరణను ప్రేరేపించి.. గుండె ఆరోగ్యంగా ఉండటానికి అల్లం దోహదపడుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. కానీ రక్తం చిక్కగా ఉన్నవారు మాత్రం అల్లం విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రక్తం పలుచగా చేసే మందులు వాడేవారు అల్లాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక రక్తస్రావం అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

మధుమేహం ఉన్న కొంత మంది అల్లం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని నిపుణులు అంటున్నారు. రక్తంలో గ్లూకోజ్​ స్థాయిలను తగ్గిస్తుందనే కారణంగా అల్లాన్ని ఎక్కువగా వినియోగిస్తున్న వారు ఒక విషయాన్ని గమనించాలని తెలుపుతున్నారు. షుగర్ కోసం మందులు వాడేవారు అల్లం వాడటం వల్ల ఆ ప్రభావం ఔషధాల పై చూపిస్తుందని అందువల్ల షుగర్ పెరగవచ్చు లేదా తగ్గవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ షుగర్​ సంబంధిత మందులు వాడుతున్నట్లయితే జాగ్రత్త వహించాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరోవైపు అల్లం అందరి విషయంలో ఒకే ప్రభావం చూపించక పోవచ్చని ఆరోగ్యనిపుణులు అంటున్నారు. ఈ అల్లం కొంతమందికి వరంగా.. మరికొందరికి శాపంగా మారుతుందని తెలుపుతున్నారు. ఈ అల్లం వాడటం వల్ల కొందరిలో చర్మంపై దద్దుర్లు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.. అలెర్జీ, చర్మ సమస్యలు ఉన్న వారు అల్లాన్ని తాకినపుడు శరీరంపై ఏవైనా దద్దుర్లు ఏర్పడితే ముందుగా ఆ భాగాన్ని శుభ్రంగా కడిగి వెంటనే వైద్యుడిని సంప్రదించాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అల్లాన్ని మితంగా తీసుకోవాలని వారు చెబుతున్నారు.

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ విషయాలు చెప్పడం జరిగింది.. వీటిని ప్రయత్నించే ముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి..

You may also like

Leave a Comment