హనుమాన్ చాలీసా(Hanuman Chalisa)…ఆధ్యాత్మిక గురువు తులసీదాస్(Tulsidas) ‘అవధి’ భాషలో రాసిన ఆంజనేయ స్తుతి. నలభై శ్లోకాలలో అంజనీ పుత్రుణ్ని కొనియాడాడు. ఎన్నో ఏళ్ల క్రితం రాసిని హనుమాన్ చాలీసా పలు భాషల్లోకి తర్జుమా చేయబడింది. కోట్లమంది భక్తుల హృదయాలకు చేరువైంది.
పాకెట్ బుస్స్ గా సైతం అందుబాటులో ఉంది. అయితే తాజాగా లక్నో(Lucknow)కి చెందిన ఓ నగల వ్యాపారి ఈ హనుమాన్ చాలీసాను 24 క్యారెట్ల బంగారంతో హనుమాన్ స్వర్ణచాలీసాను రూపొందించాడు.
ఒరిజినల్ లాంగ్వేజ్ అయిన అవధి భాషలోని శ్లోకాలతో పాటూ హిందీ తాత్పర్యాన్ని కూడా చాలీసాకు అనుసంధానించారు తయారీ దారులు.అంతే కాదు భావానికి సంబంధిచిన చిత్రాలను సైతం స్వర్ణ చాలీసాలో పొందుపరిచాడు.
ఇక ఈ చాలీసా ప్రత్యేకతల విషయానికి వస్తే …ఈ స్వర్ణ చాలీసా నీటిలో నానదు,నిప్పులో కాలదు, ఎలుకలు ఏమీ చేయలేవు, చెదలు కూడా చదివి ఊరుకుంటాయి గానీ చాలీసాను తినలేవు.
ఇక మరో ప్రత్యేకత ఏంటంటే కంటి చూపు తగ్గిన వారు సైతం దీన్ని ఈజీగా చదవగలరు. ఈ నగల వ్యాపారి బంగారు చాలీసాను మాత్రమే కాదు వెండి చాలీసాను కూడా ముద్రించే ప్రయత్నంలో ఉన్నారట. ‘బంగారమంటున్నారు..24 క్యారెట్ల బంగారమంటున్నారని ఇది మనం సాగలేని చాలీసా అని సరిపెట్టుకోవద్దు.
ఇది అందరికీ అందుబాటు ధరల్లో తీర్చిదిద్దారట తయారీదారులు. రూ.2000కి మన పూజా మందిరంలోకి ఈ స్వర్ణ చాలీసా చేరుతుంది. ఆన్ లైన్ లో అందుబాటులో ఉందంటున్నారు చాలీసా మేకర్స్. ఇంకెందుకు ఆలస్యం జై హనుమాన్ అంటూ ఆర్డర్ పెట్టేయండి మరి.