Telugu News » Harish Rao : రాష్ట్రంలో జీతం కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి వచ్చింది.. ప్రభుత్వంపై హరీశ్‌ రావు ఫైర్..!

Harish Rao : రాష్ట్రంలో జీతం కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి వచ్చింది.. ప్రభుత్వంపై హరీశ్‌ రావు ఫైర్..!

కాంగ్రెస్ (Congress) ప్రభత్వం హయాంలో నెలంతా పనిచేసి జీతం కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి వచ్చిందని ఆరోపించారు.. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, అంగన్ వాడీ టీచర్లు, ఆయాలు, సమగ్ర శిక్ష, కేజీబీవీ సిబ్బందికి జీతాలు చెల్లించాలని ఎక్స్‌ (X) వేదికగా ఎమ్మెల్యే హరీశ్‌ రావు డిమాండ్‌ చేశారు.

by Venu
harish rao Comments on governor speech

కాంగ్రెస్ ప్రభుత్వంపై సిద్దిపేట (Siddipet) ఎమ్మెల్యే హరీశ్‌ రావు విమర్శలు గుప్పించారు.. హామీలు తప్ప ఆచరణ మాత్రం కాంగ్రెస్‌కు సాధ్యం కావడం లేదని చురకలు అంటించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన.. 22 రోజులు గడుస్తున్నా జీతం రాకపోవడంతో అంగన్‌వాడీలు (Anganwad Workers) అనేక తిప్పలు పడుతున్నారని పేర్కొన్నారు.

brs mla harish rao counters to revanth reddy comments on jobs in telangana

కాంగ్రెస్ (Congress) ప్రభత్వం హయాంలో నెలంతా పనిచేసి జీతం కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి వచ్చిందని ఆరోపించారు.. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, అంగన్ వాడీ టీచర్లు, ఆయాలు, సమగ్ర శిక్ష, కేజీబీవీ (KGBV) సిబ్బందికి జీతాలు చెల్లించాలని ఎక్స్‌ (X) వేదికగా ఎమ్మెల్యే హరీశ్‌ రావు (Harish Rao) డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను తీర్చకుంటే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో 13 హామీలు ఉన్నాయని తెలిపిన హరీశ్‌ రావు.. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే వాటన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.. విమర్శలతో కాలం గడుపుతున్న ప్రభుత్వ తీరును తెలంగాణ (Telangana) ప్రజలు గమనిస్తున్నారని.. సరైన సమయంలో తగిన గుణపాఠం చెబుతారన్నారని అన్నారు.. కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంపై దృష్టి సారించాలని హితవు పలికారు.

You may also like

Leave a Comment