Telugu News » ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా సితార నెలకు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?

ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా సితార నెలకు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?

ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా సితార ఎంత సంపాదిస్తున్నారు?

by Sri Lakshmi

మహేష్ బాబు కూతురు సితార ఇటీవల వార్తల్లో నిలుస్తోంది. ప్రస్తుతం ఆమె వయస్సు కేవలం పదకొండేళ్లు మరియు ఆమెకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ మామూలుది కాదు. చిన్న వయసులో అత్యధిక ఫాలోయింగ్ ను ఆమె సొంతం చేసుకున్నారు. ఇప్పటి వరకు ఆమె ఒక్క సినిమాలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించలేదు. కానీ, ఆమె పాపులారిటీ మాత్రం ఓ రేంజ్ లో ఉంటుంది. PMS జెవెలెరీ వారి కోసం సితార ఓ అంతర్జాతీయ యాడ్ షూట్ లో నటించారు. ఈ షూట్ కోసం ఆమెకు కోటి రూపాయల పారితోషికం చెల్లించారట.

ఇక చిన్న వయసులోనే తనకంటూ సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ ను స్టార్ట్ చేసేసింది ఈ ఘట్టమనేని ప్రిన్సెస్. తనకు ఎంతో ఇష్టమైన డాన్స్ వీడియోలను, తాను ఇంట్లో సరదాగా చేసే అల్లరి వీడియోలను ఆమె ఈ ఛానెల్ లో పంచుకుంటూ ఉంటారు. సితార ఇప్పటి వరకు ఒక్క సినిమాలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించకపోయినా.. త్వరలోనే ఆమె హీరోయిన్ గా ఇండస్ట్రీ కి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే సితార పలు సార్లు తనకి సినిమాల పట్ల ఉన్న ఆసక్తి గురించి ప్రకటిస్తూ వచ్చారు.

అయితే.. ఇన్స్టాగ్రామ్ లో మాత్రం సితార తన అభిమానులతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటూ వస్తున్నారు. ఎప్పటికప్పుడు తన గురించిన ముచ్చట్లని పంచుకుంటూ ఉంటారు. అలాగే.. తనకి ఫాలోయర్స్ ఎక్కువగా ఉండడంతో.. పలు రకాల ప్రొడక్ట్స్ తమని ప్రమోట్ చేయాలంటూ సితారను రిక్వెస్ట్ చేస్తూ ఉంటాయి. వాటి ప్రమోషన్స్ తో సితార గట్టిగానే సంపాదిస్తున్నారని చెప్పచ్చు. ఈ ప్రోడక్ట్ ప్రమోషన్స్ తోనే సితార నెలకు ముప్పై లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నారట. ఇది టాప్ హీరోలకు కూడా ఒక్కోసారి కష్టం అయ్యే సంపాదనే. ఈ వార్త వైరల్ అవ్వడంతో మహేష్ అభిమానులు సితారను చూసి తెగ మురిసిపోతున్నారు.

You may also like

Leave a Comment