రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Taping Case)లో మరో ట్విస్ట్ చోటు చేసుకొంది. ఇప్పటికే కీలక మలుపులు తిరుగుతున్న ఈ వ్యవహారం ఇంకా చివరి దశకు చేరలేదని తెలుస్తోంది. కాగా ఈ కేసులో అరెస్టైన నలుగురు పోలీస్ అధికారులు బెయిల్ పిటిషన్‌ను విత్ డ్రా చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. పోలీసులు సెక్షన్ 70 ఐటీ యాక్ఠ్ కింద నలుగురు నిందితులపై కేసు నమోదు చేశారు..
అయితే ఈ యాక్ట్ కింద 10 ఏళ్ల కంటే ఎక్కువ శిక్షపడే అవకాశం ఉండటంతో సెషన్ కోర్టుకు వెళ్లాలని నాంపల్లి ఏసీఎంఎం కోర్టు సూచించింది. దీంతో వారు తమ బెయిల్ పిటిషన్లను విత్ డ్రా చేసుకొన్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం నాంపల్లి (Nampally) సెషన్ కోర్టులో కొత్తగా బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారని తెలుస్తోంది. గత ఎన్నికల సందర్భంగా పోలీసు వాహనాల్లో నగదును అక్రమంగా తరలించిన విషయం తెలిసిందే..
అయితే ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు సందర్భంగా ఈ నిజాలు వెలుగు చూడటంతో హైదరాబాద్ (Hyderabad) పోలీసులు ఈ ఘటనను సీరియస్‌గా తీసుకొన్నారు. ఈ క్రమంలో మాజీ డీసీపీ రాధా కిషన్ రావు ( Radhakishan Rao), మాజీ అడిషనల్ ఎస్పీలు భుంజగరావు, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావులను ఇదివరకే అరెస్ట్ చేసిన పోలీసులు వీరిని ప్రస్తుతం రిమాండ్ ఖైదీలుగా సెల్లో ఉంచారు..
అలాగే ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు నేతృత్వంలో సాగిన ఈ అక్రమ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే సిట్ అధికారులు పలు కీలక ఆధారాలు సేకరించారు. ఈ కేసులో ప్రముఖ రాజకీయ నేతలున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వారికి కూడా త్వరలో నోటీసులు అందుతాయనే వార్తలు కొన్ని రోజులుగా ప్రచారంలోకి వస్తున్నాయి.. అయితే రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చే అంశంపై స్పందించిన నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి.. ఆ వివరాలను త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు.