Telugu News » Hyderabad : ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్.. బెయిల్ పిటిషన్ విత్ డ్రా చేసుకొన్న నలుగురు నిందితులు..!

Hyderabad : ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్.. బెయిల్ పిటిషన్ విత్ డ్రా చేసుకొన్న నలుగురు నిందితులు..!

ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ టి.ప్రభాకర్‌రావు నేతృత్వంలో సాగిన ఈ అక్రమ ట్యాపింగ్‌ వ్యవహారంలో ఇప్పటికే సిట్‌ అధికారులు పలు కీలక ఆధారాలు సేకరించారు. ఈ కేసులో ప్రముఖ రాజకీయ నేతలున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో

by Venu
Another sensation in the phone tapping case

రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Taping Case)లో మరో ట్విస్ట్ చోటు చేసుకొంది. ఇప్పటికే కీలక మలుపులు తిరుగుతున్న ఈ వ్యవహారం ఇంకా చివరి దశకు చేరలేదని తెలుస్తోంది. కాగా ఈ కేసులో అరెస్టైన నలుగురు పోలీస్‌ అధికారులు బెయిల్‌ పిటిషన్‌ను విత్‌ డ్రా చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. పోలీసులు సెక్షన్‌ 70 ఐటీ యాక్ఠ్‌ కింద నలుగురు నిందితులపై కేసు నమోదు చేశారు..

Another new angle in the phone tapping case.అయితే ఈ యాక్ట్ కింద 10 ఏళ్ల కంటే ఎక్కువ శిక్షపడే అవకాశం ఉండటంతో సెషన్ కోర్టుకు వెళ్లాలని నాంపల్లి ఏసీఎంఎం కోర్టు సూచించింది. దీంతో వారు తమ బెయిల్ పిటిషన్లను విత్ డ్రా చేసుకొన్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం నాంపల్లి (Nampally) సెషన్‌ కోర్టులో కొత్తగా బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయనున్నారని తెలుస్తోంది. గత ఎన్నికల సందర్భంగా పోలీసు వాహనాల్లో నగదును అక్రమంగా తరలించిన విషయం తెలిసిందే..

అయితే ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తు సందర్భంగా ఈ నిజాలు వెలుగు చూడటంతో హైదరాబాద్‌ (Hyderabad) పోలీసులు ఈ ఘటనను సీరియస్‌గా తీసుకొన్నారు. ఈ క్రమంలో మాజీ డీసీపీ రాధా కిషన్ రావు ( Radhakishan Rao), మాజీ అడిషనల్ ఎస్పీలు భుంజగరావు, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావులను ఇదివరకే అరెస్ట్ చేసిన పోలీసులు వీరిని ప్రస్తుతం రిమాండ్ ఖైదీలుగా సెల్లో ఉంచారు..

అలాగే ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ టి.ప్రభాకర్‌రావు నేతృత్వంలో సాగిన ఈ అక్రమ ట్యాపింగ్‌ వ్యవహారంలో ఇప్పటికే సిట్‌ అధికారులు పలు కీలక ఆధారాలు సేకరించారు. ఈ కేసులో ప్రముఖ రాజకీయ నేతలున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వారికి కూడా త్వరలో నోటీసులు అందుతాయనే వార్తలు కొన్ని రోజులుగా ప్రచారంలోకి వస్తున్నాయి.. అయితే రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చే అంశంపై స్పందించిన నగర పోలీసు కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి.. ఆ వివరాలను త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు.

You may also like

Leave a Comment