Telugu News » Hyderabad : నగరంలో క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ అరెస్ట్.. కోట్లల్లో నగదు సీజ్..!

Hyderabad : నగరంలో క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ అరెస్ట్.. కోట్లల్లో నగదు సీజ్..!

ఇలాంటి చర్యల వల్ల మంచి కుటుంబాలు సైతం రోడ్డున పడుతాయని తెలిపిన వారు.. ఎవరైనా బెట్టింగ్‌ పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

by Venu
betting

రాష్ట్రంలో ఐపీఎల్ (IPL) సందర్భంగా క్రికెట్ బెట్టింగ్‌ (Cricket Betting) దందా జోరుగా సాగుతుంది.. ఈ ఆట మీద ఉన్న పిచ్చి ఒకవైపు కాగా.. పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందనే ఆశతో కొందరు బెట్టింగ్ పై ఆసక్తి చూపిస్తున్నారు.. ఈ నేపథ్యంలో రోజు కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయని సమాచారం.. కాగా ఈ ఉచ్చులో పడి కొందరు ఆర్థికంగా దివాళా తీస్తున్న ఘటనలు సైతం చోటు చేసుకొంటున్నాయి..

ఈ క్రమంలో సమాచారం అందుకొన్న సైబరాబాద్ (Cyberabad) ఎస్‌వోటీ పోలీసులు తాజాగా మియాపూర్, కూకట్‌పల్లి పరిధిలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 15 మంది క్రికెట్ బెట్టింగ్‌ ముఠా సభ్యులను అరెస్ట్‌ చేశారు. కాగా వీరంతా వివిధ రకాల ఆన్‌లైన్ (Online) యాప్స్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ కి పాల్పడుతున్నట్లు గుర్తించారు. అదేవిధంగా నిందితుల నుంచి 2 కోట్ల 41 లక్షల నగదు, ల్యాప్‌టాప్స్, సెల్ ఫోన్‌లు వంటి వాటిని స్వాధీన పరచుకొన్నారు..

మరోవైపు హైదరాబాద్ (Hyderabad) శివారు ప్రాంతాలను అడ్డాగా చేసుకొని బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ఈ ముఠా.. ప్రతిరోజు కోట్ల రూపాయాల బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు పోలీసులు (Police) దర్యాప్తులో గుర్తించారు.. ఇలాంటి చర్యల వల్ల మంచి కుటుంబాలు సైతం రోడ్డున పడుతాయని తెలిపిన వారు.. ఎవరైనా బెట్టింగ్‌ పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

You may also like

Leave a Comment