Telugu News » MP Laxman : బీఆర్ఎస్-కాంగ్రెస్ ఒకే గూటి పక్షులు.. ఇదే సాక్ష్యం..!!

MP Laxman : బీఆర్ఎస్-కాంగ్రెస్ ఒకే గూటి పక్షులు.. ఇదే సాక్ష్యం..!!

రెండు రోజుల క్రితం కిషన్ రెడ్డి.. కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐ విచారణ కోరితే 24 గంటల్లో పూర్తి అవుతోందని వెల్లడించిన విషయం తెలిసిందే.. మరోవైపు బీజేపీ నేత లక్ష్మణ్.. సైతం మండిపడ్డారు.. మరోసారి కాళేశ్వరంపై కాంగ్రెస్ సర్కార్ సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని ప్రశ్నిస్తున్నారు..

by Venu
MP Laxman

ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి (Revanth Reddy).. కాళేశ్వరం (Kaleswaram) అవినీతిపై చేసిన రచ్చ రాష్ట్రమంతా తెలిసిందే.. తాము అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం అవినీతిపై చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు కూడా.. ఇదే వేడిలో ప్రాజెక్ట్ అవినీతిపై బీజేపీ (BJP) ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.. అయితే రేవంత్ ఎన్నికలలో చేసిన ఆరోపణలు బీజేపీ నేతలు ప్రస్తుతం ఆయనకే విసురుతున్నారని అనుకొంటున్నారు..

MP Laxman

రెండు రోజుల క్రితం కిషన్ రెడ్డి.. కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐ విచారణ కోరితే 24 గంటల్లో పూర్తి అవుతోందని వెల్లడించిన విషయం తెలిసిందే.. మరోవైపు బీజేపీ నేత లక్ష్మణ్.. సైతం మండిపడ్డారు.. మరోసారి కాళేశ్వరంపై కాంగ్రెస్ సర్కార్ సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని ప్రశ్నిస్తున్నారు.. తెలంగాణ బీజేపీ స్టేట్ కార్యాలయంలో జరిగిన సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..

సావిత్రి భాయి పూలే ఆశయాలను మోడీ కొనసాగిస్తున్నారని తెలిపారు.. మహిళలకు కేంద్ర మంత్రివర్గంలో పెద్ద పీట వేశారని, త్రిబుల్ తలాక్ ను రద్దు చేయడమే కాకుండా.. చట్ట సభల్లో మహిళ రిజర్వేషన్ లు కల్పించామని లక్ష్మణ్ (Laxman) పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్ (Congress) నేతలు కాళేశ్వరం ప్రాజెక్ట్ పై.. అధికారంలోకి రాగానే విచారణ చేస్తామన్న విషయాన్ని గుర్తు చేశారు.

కాళేశ్వరంలో నొక్కిన డబ్బును కక్కిస్తామని.. అధికారులపై కఠినంగా వ్యవహరిస్తామని.. సీబీఐ విచారణ చేయిస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు.. ఉలుకు పలుకు లేని మాటలు చూస్తుంటే బీఆర్ఎస్- కాంగ్రెస్ వేరు కాదనే విషయం సృష్టంగా అర్థం అవుతోందని ఆరోపణలు గుప్పించారు. ఈ విషయాన్ని ఎన్నికల ముందే బీజేపీ పేర్కొన్నట్టు తెలిపారు..

You may also like

Leave a Comment