Telugu News » Hyderabad : వాళ్ళిద్దరూ నన్ను పిచ్చోడిని చేసిండ్రు.. కాళ్లు పట్టుకున్న..!? సంచలన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్..

Hyderabad : వాళ్ళిద్దరూ నన్ను పిచ్చోడిని చేసిండ్రు.. కాళ్లు పట్టుకున్న..!? సంచలన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్..

కష్టకాలంలో పార్టీని వదిలిపెట్టి.. ఏం పట్టనట్లు వెళ్ళడం వారి విజ్ఞతకు వదిలేస్తున్నానని అన్నారు.. కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుందని కేటీఆర్ పేర్కొన్నారు.

by Venu
KTR in a helpless state.. Does anyone want to know the secret behind his comments?

కీలక నేతలంతా బీఆర్ఎస్ (BRS)ను వదిలి వెళ్తున్న నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్ (KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు.. కీలక నేతలు తనను నమ్మించి ముంచారని ఆరోపించారు.. గతంలో పార్టీ మారేది లేదని ఎంపీ రంజిత్​రెడ్డి (MP Ranjith Reddy), మాజీ మంత్రి పట్నం మహేందర్ (Patnam Mahender) తనతో తెలిపినట్లు వెల్లడించారు.. తాను వారి మాటలు పిచ్చివాడిలా నమ్మానని తెలిపారు..

తెలంగాణ (Telangana) భవన్​లో చేవెళ్ల పార్లమెంట్ సన్నాహక స‌మావేశంలో పాల్గొన్న కేటీఆర్ నేతల తీరుపై ఫైర్ అయ్యారు.. రంజిత్​రెడ్డి, మహేందర్​రెడ్డి నటన ఆస్కార్ లెవల్లో ఉందని ఎద్దేవా చేసిన ఆయన.. 15రోజుల్లో వారు కండువా మార్చడం కుటిల బుద్ధికి నిదర్శనమని విమర్శించారు.. ఇంటి దొంగ‌ను ఈశ్వరుడు కూడా ప‌ట్టలేడనే సామెత ఇలాంటి వారిని చూసే పుట్టిందని ఆరోపించారు..

కవిత (Kavitha) అరెస్ట్ అయిన రోజు నవ్వుకుంటూ కాంగ్రెస్​లోకి వెళ్ళిన రంజిత్ రెడ్డి.. పట్నం మహేందర్ రెడ్డిలపై పగ తీసుకోవాల్సిన అవసరం ఉందని మండిపడ్డారు.. ఇలాంటి వాళ్ళు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా మళ్లీ బీఆర్ఎస్​లోకి రానీయ్యం అని శపథం చేశారు.. ఇక కేకే, కడియంలాంటి నాయకులు కష్టకాలంలో పార్టీని వదిలిపెట్టి.. ఏం పట్టనట్లు వెళ్ళడం వారి విజ్ఞతకు వదిలేస్తున్నానని అన్నారు.. కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుందని కేటీఆర్ పేర్కొన్నారు.. ప్రస్తుత పరిస్థితుల్లో నాయకులు పార్టీని వదిలేసినా.. పార్టీ శ్రేణుల కోసం నేను స్వయంగా పనిచేస్తానని అన్నారు..

ఏప్రిల్ 13న జరిగే చెవెళ్ల పార్లమెంట్ మీటింగ్ కు ప్రతి ఒక్కరూ తరలిరావాలని పిలుపునిచ్చారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి పై విరుచుకుపడిన కేటీఆర్.. కాంగ్రెస్​ (Congress) ఇచ్చిన 420 హామీలు త్వరగా నెరవేర్చు. లేకుంటే నీకు నల్లగొండ, ఖమ్మం నాయకులే మానవ బాంబులైతరని హెచ్చరించారు.. ఆరు గ్యారంటీలు గాలికి వదిలి.. ఆరు గారఢీలు ప్రదర్శిస్తున్న రేవంత్ ఐదేండ్లు ప్రభుత్వంలో ఉండని ఎద్దేవా చేశారు..

You may also like

Leave a Comment