Telugu News » Revanth Reddy : కాంగ్రెస్ ను దొంగ దెబ్బ తీస్తున్న బీజేపీ-బీఆర్ఎస్.. సీఎం సంచలన వ్యాఖ్యలు..!

Revanth Reddy : కాంగ్రెస్ ను దొంగ దెబ్బ తీస్తున్న బీజేపీ-బీఆర్ఎస్.. సీఎం సంచలన వ్యాఖ్యలు..!

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వంపై ఉద్యోగులు విశ్వాసం కోల్పోయారన్నారని విమర్శించారు.. 30వేల ఉద్యోగాలను మూడు నెలల్లో భర్తీ చేసి నిరుద్యోగుల్లో భరోసా కల్పించామని అన్నారు..

by Venu
Congress : Congress eyeing BRS's stronghold.. Strategy to win MP election is ready!

కాంగ్రెస్ ప్రభుత్వం వాల్మీకి బోయల సంక్షేమానికి కట్టుబడి ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు.. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత సంక్షేమంలో, అభివృద్ధి, విద్యలో సముచిత స్థానం కల్పించే బాధ్యత కాంగ్రెస్ తీసుకొంటుందని అన్నారు.. వాల్మీకి బోయలతో నేడు జరిగిన సమావేశంలో మాట్లాడిన సీఎం.. వాల్మీకి బోయలు కాంగ్రెస్ కు అండగా నిలవాలని కోరారు.. వందరోజుల్లో ఒక మంచి పరిపాలన అందించామని పేర్కొన్నారు..

CM Revanth Reddy: Revanth Reddy will go to his own land for the first time as CM..!పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వంపై ఉద్యోగులు విశ్వాసం కోల్పోయారన్నారని విమర్శించారు.. 30వేల ఉద్యోగాలను మూడు నెలల్లో భర్తీ చేసి నిరుద్యోగుల్లో భరోసా కల్పించామని అన్నారు.. మొదటి తారీఖు జీతాలు ఇచ్చి ప్రభుత్వంపై ఉద్యోగులకు విశ్వాసం కల్పించామని తెలిపారు.. వందరోజులు పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేసిందని.. గడీలను బద్దలు కొట్టి ప్రజా పాలన తీసుకొచ్చామ‌ని సీఎం వెల్లడించారు..

గత ప్రభుత్వం చేసిన ఆరాచకాలకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒక ఉదాహరణ అని ఆరోపించారు.. కేటీఆర్ (KTR) కొద్ది మంది సంభాషణలు విన్నామని మాట్లాడటం సిగ్గు చేటని మండిపడ్డారు.. ఇలా బరి తెగించి ఎవరైనా మాట్లాడుతారా.? అని రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్ర‌శ్నించారు. ఫోన్ టాపింగ్ కు పాల్పడిన వాళ్లు చర్లపల్లి జైలులో తప్పక ఊచలు లెక్కబెడతారని జోస్యం చెప్పారు.

అదేవిధంగా 200 ఓట్లతో మహబూబ్ నగర్ (Mahbub Nagar) ఎమ్మెల్సీ గెలవబోతున్నామ‌ని ధీమా వ్యక్తం చేశారు.. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ (BRS) గూడు పుఠాని చేయకపోతే ఆలంపూర్, గద్వాల గెలిచే వాళ్లమ‌ని రేవంత్ పేర్కొన్నారు.. బీజేపీ (BJP)లో ఉన్న డీకే అరుణ (DK Aruna) ఈ ప్రాంతానికి ఏం చేసిందని విమర్శించారు..

ఆర్డీఎస్ ద్వారా కర్ణాటక నుంచి నీళ్లు తెచ్చారా.. తుమ్మిళ్ల ప్రాజెక్టు పూర్తి చేశారా.? అంటూ విమర్శించారు.. తాను మాత్రం జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి తెచ్చుకొన్నారు.. కానీ పాలమూరు, రంగా రెడ్డికి ఎందుకు జాతీయ హోదా తీసుకురాలేదని ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ (Congress)ను దొంగ దెబ్బ తీసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయని రేవంత్ ఆరోపించారు..

You may also like

Leave a Comment