Telugu News » Hyderabad : తెలంగాణ ప్రభుత్వం బీసీల పక్షపాతినా.. ?

Hyderabad : తెలంగాణ ప్రభుత్వం బీసీల పక్షపాతినా.. ?

ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకవెళ్తామని తెలిపారు.. తెలంగాణ ప్రభుత్వం బీసీల అభివృద్దికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు..

by Venu

తెలంగాణ (Telangana) రాష్ట్రంలో బీసీ కులగణనపై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం పలువురి నుంచి ప్రశంసలు అందుకోంటుంది. ఈ నేపథ్యంలో బీసీ కులగణన విషయంలో ప్రభుత్వానికి అన్ని విధాలా అండగా ఉంటామని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి పేర్కొన్నారు. మేడ్చల్ (Medchal) జిల్లా పర్యటనలో భాగంగా కుత్బుల్లాపూర్ (Quthbullapur)లో నాయి బ్రాహ్మణుల ఆత్మగౌరవ భవనాన్ని పరిశీలించారు..

ఈమేరకు బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణం పూర్తి చేయడానికి ప్రభుత్వం సహకరించాలని కోరుతూ నాయీ బ్రాహ్మణుల నాయకులు కుమార స్వామికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకవెళ్తామని తెలిపారు.. తెలంగాణ ప్రభుత్వం బీసీల అభివృద్దికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు.. మరోవైపు రాష్ట్రంలో కులగణన విషయంలో ప్రభుత్వం ఇటీవల చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకొన్న విషయాన్ని గుర్తు చేశారు..

బీహార్ కులగణన తరహాలో తెలంగాణలో కులగణన చేయడం అభినందనీయమన్నారు.. 2022లో బీహార్ ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ కులాల జనాభాను లెక్కించే లక్ష్యంతో కుల-ఆధారిత గణన నిర్వహించింది. ఈ గణన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమై, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని దుండ్ర కుమారస్వామి (Dundra Kumaraswamy) తెలిపారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, బీహార్ మాడెల్ కుల గణన చేపడతాము అని చెప్పడం అభినందనీయం అని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల పక్షపాతి అని కొనియాడారు.. ఇకపోతే బీహార్ రాష్ట్రంలో కుల గణన మొదటి దశలో, అన్ని జిల్లాల్లో, బ్లాకుల్లో మరియు పట్టణ స్థానిక సంస్థల్లో మొత్తం కుటుంబాల సంఖ్యను లెక్కించి నమోదు చేశారు.. రెండవ దశలో గుర్తించిన కుటుంబాలలో వ్యక్తుల కులం, ఉపకులం, సామాజిక-ఆర్థిక వివరాలను 17 ప్రశ్నల ద్వారా డాటాను ఎనుమరేటర్లు సేకరించారని కుమారస్వామి వివరించారు..

రాష్ట్రంలో కులగణన ప్రక్రియ సరిలీకృతం చేసి, సంక్షిప్త సమాచార అధ్యయనంతో తెలంగాణ రాష్ట్రంలో వెనుక బడిన తరగతుల ప్రజలను సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా మరియు అన్నీ రంగాలలో ఎదగడానికి కృషి చేయాలని ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

You may also like

Leave a Comment