Telugu News » Tripti Dimri : ఎవరు ఏమనుకున్న ఐ డోంట్ కేర్.. ఆమె నాకు స్ఫూర్తి అంటున్న త్రిప్తి!

Tripti Dimri : ఎవరు ఏమనుకున్న ఐ డోంట్ కేర్.. ఆమె నాకు స్ఫూర్తి అంటున్న త్రిప్తి!

సినిమా అనే రంగుల ప్రపంచంలో తెరపై కనిపినించినంత వరకే నటీనటులకు గుర్తింపు,పేరు ప్రఖ్యాతలు వస్తాయి. ఒక్కసారి సిల్వర్ స్క్రీన్ దూరమైతే కెరీర్ ముగిసినట్లే అని తెలుసుకోవాలి. అందుకే ఇండస్ట్రీలో చాలా మంది యాక్టర్స్ తమ ఉనికిని కాపాడుకోవడానికి ఎంతో కష్టపడుతుంటారు.

by Sai
I don't care what anyone thinks.. Tripti says she is my inspiration

సినిమా అనే రంగుల ప్రపంచంలో తెరపై కనిపినించినంత వరకే నటీనటులకు గుర్తింపు,పేరు ప్రఖ్యాతలు వస్తాయి. ఒక్కసారి సిల్వర్ స్క్రీన్ దూరమైతే కెరీర్ ముగిసినట్లే అని తెలుసుకోవాలి. అందుకే ఇండస్ట్రీలో చాలా మంది యాక్టర్స్ తమ ఉనికిని కాపాడుకోవడానికి ఎంతో కష్టపడుతుంటారు.

మేల్ యాక్టర్స్ సంగతి కాసేపు పక్కన పెడితే స్ట్రగుల్ అంతా ఫీమెల్ యాక్టర్స్‌కే ఎక్కువగా ఉంటుంది. ఇండస్ట్రీ ఏదైనా అగ్ర హీరోలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది కాబట్టి వారికి హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా ఆఫర్స్ వస్తూనే ఉంటాయి. కానీ, హీరోయిన్స్‌కు అలా కాదనే విషయం గుర్తుపెట్టుకోవాలి.

I don't care what anyone thinks.. Tripti says she is my inspiration

అందం, ఏజ్, సక్సెస్ రేట్, రెమ్యూనరేషన్ ఇలా అన్నింటిలోనూ వారికి కొలమానం ఉంటుంది. దీనికి తోడు ఇండస్ట్రీలో కొత్తగా నెపోటిజం అండ్ కమిట్‌మెంట్‌కు కూడా నేటితరం నటీమణులు బలవుతున్నారు. అయితే, ఇండస్ట్రీలో ఎన్నిసినిమాలు చేశామన్నది ముఖ్యం కాదు.. మన పేరు జనాలకు గుర్తుండిపోవాలి..అలాంటి వాటి కోసం ఎంతైనా డేర్ చేసేందుకు సిద్ధం అంటోంది యానిమల్ మూవీలో చేసిన ఒక్క సీన్‌తో కుర్రాళ్ల మనసు దోచేసిన బోల్డ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి..

యానిమల్(ANIMAL) మూవీకి ముందు ఆరేళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నా త్రిప్తికి(Tripti Dimri) సరైన హిట్ రాలేదంట. అసలు ఆమె ఎవరో కూడా అప్పట్లో జనాలకు తెలీదని చెప్పింది. యానిమల్‌లో రణబీర్ కపూర్‌తో కలిసి చేసిన ఒక్క బోల్డ్ సీన్ తో ప్రస్తుతం హాట్ ఫేవరేట్ హీరోయిన్ లిస్టులో త్రిప్తి చేరిపోయింది.దీంతో వరుసగా ఆఫర్లు వస్తున్నాయని అంటోంది త్రిప్తి డిమ్రి..అయితే, సిల్వర్ స్క్రీన్‌పై ఆమె ఇన్‌స్పిరేషన్ హీరోయిన్ ‘ప్రియాంక చోప్రా’(PRIYANKA CHOPRA) అంటూ తన మనసులో మాట బయటపెట్టేసింది ఈ ముద్దుగుమ్మ. తనకు నచ్చితే, కెరీర్ కోసం ఎంతవరకు ఐనా వెళ్తానని, విమర్శకుల గురించి ఐ డోంట్ కేర్ అని తేల్చిచెప్పింది త్రిప్తి..

You may also like

Leave a Comment