విశాఖ(Vizag)లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా స్టార్ పేసర్(Team India star pacer) జస్రీత్ బుమ్రా(Jasrit Bumrah) చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ పతనంలో కీలకపాత్ర పోషించాడు. బుమ్రా దెబ్బకు ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ 253 పరుగులకు ఆలౌట్ అయింది.
యార్కర్స్, స్వింగ్ బంతులతో బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను పెవిలియన్‌కు పంపిన బంతి హైలెట్ అని చెప్పాలి. బుమ్రా దెబ్బకు స్టోక్స్ ఏకంగా బ్యాట్ కిందపడేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
జస్రీత్ బుమ్రా వేసిన ఇన్నింగ్స్ 50వ ఓవర్లో రెండో బంతిని బెన్ స్టోక్స్ ఎదుర్కొన్నాడు. కట్టర్ సంధించి స్టోక్స్‌ను బుమ్రా బోల్తా కొట్టించాడు. ఆఫ్ స్టంప్ దిశగా తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని స్టోక్స్ డిఫెండ్ చేయబోయాడు. అయితే బంతి మిస్ అయి ఆఫ్ స్టంప్‌ను పడగొట్టింది. దీంతో స్టోక్స్ వెనక్కి కూడా చూడకుండా బ్యాట్ కింద పడేసి నిరాశతో క్రీజును వదిలివెళ్లాడు.
ఈ వికెట్’కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతోంది. స్టోక్స్‌ను ఔట్ చేయడం ద్వారా బుమ్రా టెస్టుల్లో 150 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. అంతకుముందు 28వ ఓవర్లో ఓ అద్భుత యార్కర్‌తో తొలి టెస్ట్ సెంచరీ హీరో ఓలి పోపన్ను ఔట్ చేశాడు. రెండోరోజు ఆట ముగిసేసరికి భారత్ వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (13), యశస్వి జైస్వాల్ (15) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 171 రన్స్ ఉంది.
THE DESTROYER OF ENGLAND – BUMRAH 🔥🤯pic.twitter.com/oeSPodRyax
— Johns. (@CricCrazyJohns) February 3, 2024