Telugu News » IND vs SA: టీమిండియాతో టీ20కి ముందు సౌతాఫ్రికాకు బిగ్ షాక్..!

IND vs SA: టీమిండియాతో టీ20కి ముందు సౌతాఫ్రికాకు బిగ్ షాక్..!

దక్షిణాఫ్రికా(South Africa) జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆజట్టులో కీలకమైన ఫాస్ట్ బౌలర్ లుంగి ఎంగిడి(Lungi Ngidi) టీమిండియాతో జరిగే మొత్తం సిరీస్‌కు దూరమయ్యాడు.

by Mano
IND vs SA: Big shock for South Africa before T20 against Team India..!

భారత్ వర్సెస్ సౌతాఫ్రికా(IND vs SA) మధ్య మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్(T20 Series) రేపటి నుంచి ప్రారంభం కానుంది. అయితే దక్షిణాఫ్రికా(South Africa) జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆజట్టులో కీలకమైన ఫాస్ట్ బౌలర్ లుంగి ఎంగిడి(Lungi Ngidi) టీమిండియాతో జరిగే మొత్తం సిరీస్‌కు దూరమయ్యాడు.

IND vs SA: Big shock for South Africa before T20 against Team India..!

లుంగి ఎంగిడి ప్రస్తుతం ఎడమ కాలు చీలమండలో గాయం కారణంగా జట్టు నుంచి తప్పుకున్నాడు. దీంతో భారత్‌(India)తో జరిగే టీ20 సిరీస్‌కు రెండేళ్ల తర్వాత బ్యూరాన్ హెండ్రిక్స్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. బ్యూరాన్ హెండ్రిక్స్ చివరిసారిగా 2021లో సౌతాఫ్రికా తరఫున ఆడాడు.

హెండ్రిక్స్ తన కెరీర్‌లో ఇప్పటివరకు ఒక టెస్టు, ఎనిమిది వన్డేలు, 19 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అయితే, భారత్‌తో జరిగే టీ20 సిరీస్‌లో సౌతాఫ్రికా ఫాస్ట్‌ బౌలర్ కగిసో రబడకు కూడా విశ్రాంతినిచ్చింది. దీంతో సఫారీ జట్టు బౌలింగ్‌కి గెరాల్డ్ కోయెట్రీ, నాండ్రే బెర్గర్, ఒట్నీల్ బార్ట్మన్, లిజార్డ్ విలియమ్స్ సారథ్యం వహించనున్నారు.

ఇక, భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మధ్య మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఇందులో మొదటి మ్యాచ్‌కు డర్బన్ వేదికైంది. మిగిలిన రెండు మ్యాచ్‌లు డిసెంబర్ 12, డిసెంబర్ 14న జోహన్నెస్ బర్గ్‌లో జరుగుతాయి. మూడు టీ20 మ్యాచ్‌లు ఆడిన తర్వాత రెండు జట్లు డిసెంబర్ 17 నుంచి 21 వరకు మూడు వన్డే మ్యాచ్‌లు(ODI) కొనసాగనున్నాయి.

You may also like

Leave a Comment