Telugu News » Where are you : లాటరీలో కోట్ల రూపాయల జాక్ పాట్ కొట్టాడు…కానీ.!?

Where are you : లాటరీలో కోట్ల రూపాయల జాక్ పాట్ కొట్టాడు…కానీ.!?

‘వస్తే కొండ...పోతే కేశం’ అన్న కాన్సెప్ట్ తోనే ఎవరైనా లాటరీ టికెట్ కొంటారు. అందులోనూ మన భారతీయులు ఇలాంటి లాటరీ టికెట్స్ కొనడంలో ముందుంటారు.పిల్ల కాలువలో గేలం వేసి తిమింగలం పడాలని కోరుకుంటారు.

by sai krishna

‘వస్తే కొండ…పోతే కేశం’ అన్న కాన్సెప్ట్ తోనే ఎవరైనా లాటరీ టికెట్ కొంటారు. అందులోనూ మన భారతీయులు ఇలాంటి లాటరీ టికెట్స్ కొనడంలో ముందుంటారు.పిల్ల కాలువలో గేలం వేసి తిమింగలం పడాలని కోరుకుంటారు. లక్ బావుంటే..లచ్చిందేవి ఇంటికి నడిచి వస్తుందే లేకుంటే.బెటర్ లక్ నెక్స్ట్ టైమ్ అంటుంది.

అయితే ఈమెగారు ఎవర్ని ఎప్పుడు వరిస్తుందో ఎవరికీ తెలియదు.ఒక వక్తికి అలాంటి అదృష్టం వరించింది కానీ అంతను అందుబాటులో లేడు కోట్ల రూపాయలు అతని కోసం ఎదురు చూస్తున్నాయి. వివరాల్లోకి వెళితే… దుబాయ్(Dubai)లో ఉంటున్న సయ్యద్ అలీ అనే వ్యక్తి సరదాగా ఓ లాటరీ కొన్నాడు.

తెలింసిందేగా దుబాయ్ లో ఇలాంటి లాటరీ టిక్కెట్స్ మన వాళ్లే ఎక్కువ కొంటారు. లాటరీలు కూడా మనవాళ్లకే ఎక్కువ తగులుతూ ఉంటాయి. సయ్యద్ ఈ టికెట్ ని ఆన్ లైన్ లో కొనుగోలు చేశాడు. బుధవారం తీసిన డ్రాలో ఆన్లైన్లో కొన్న టికెట్ కు లక్కీ డ్రా తగిలింది.

దుబాయ్ ‘డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ రాఫెల్ లాటరీ(Duty Free Millennium Millionaire Raffle Lottery)’లో జాక్ పాట్ కొట్టాడు. అతనికి రూ. 8.22 కోట్లు దక్కాయి.దీంతో అతడు రాత్రికి రాత్రే కోటిశ్వరుడు అయ్యాడు. కొసమెరుపేంటంటే..అతడు ఆన్ లైన్ లో ఇచ్చిన నంబర్ కు ఫోన్ చేస్తుంటే అది కలవడం లేదు.

ఎన్ని సార్లు కాల్ చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆగస్టు 30వ తేదీన 4392 నెంబర్ గల లాటరీ టికెట్ ను ఆన్ లైన్ లో కొన్నాడని నిర్వాహకులు తెలిపారు. అయితే అతడిని కాంటాక్ట్ కావడానికి వేరే మార్గాల్లో ప్రయత్నిస్తున్నామని కంపెనీ వారు తెలిపారు.

ఈ విషయం తెలిసిన వారు లక్ తలుపు తట్టినప్పుడే తెరవాలి. అతడు ఇప్పుడు కంపెనీ వాళ్లకు దొరుకుతాడో లేదో అని అనుకుంటున్నారు. ఏది ఏమైనా మరో భారతీయుడికి లాటరీ రావడం ఆనందించాల్సిన విషయం.దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్ లాటరీ టికెట్స్ 1999లో ప్రారంభమైంది.

ఈ టికెట్లు కొన్న వారిలో చాలా మంది భారతీయులే ఉన్నారు. అందులో ఇప్పటి వరకు మిలియన్ డాలర్ ను గెలుచుకున్న వారు 25 మంది. ఇప్పటివరకు ఒక మిలియన్ డాలర్(million dollars) గెలుచుకున్న భారతీయుల్లో సయ్యద్ అలీ 25వ వ్యక్తిగా నిలిచాడని నిర్వాహకులు తెలిపారు.

You may also like

Leave a Comment