Telugu News » మహిళా బస్సు డ్రైవర్… ఈమె కథ చూస్తే శభాష్ అంటారు…!

మహిళా బస్సు డ్రైవర్… ఈమె కథ చూస్తే శభాష్ అంటారు…!

by Sravya

ప్రతి ఒక్కరికి కూడా కష్టాలు ఉంటాయి. కష్టాలని దాటుకు వెళ్తేనే జీవితం అద్భుతంగా మారుతుంది. సాధారణంగా బస్సు డ్రైవర్ అంటే పురుషులే పని చేస్తారు అని మనం అనుకుంటూ ఉంటాం కానీ ఈమె మాత్రం ఒక బస్సు డ్రైవర్ గా బాధ్యతల్ని పూర్తి చేస్తోంది భారత్ వంటి అత్యధిక జనాభా కలిగిన దేశంలో పబ్లిక్ రోడ్డుపై వాహనాలు నడపడం కొంచెం కష్టమే. ట్రాఫిక్ రద్దీ ఒక వైపు అయితే ఇంకో పక్క ప్రయాణికులు ఫుట్ పాత్ మీద వేలాడుతూ ఉంటారు.

ఇలా ఇలాంటి పరిస్థితుల్లో బస్సు నడపడం అంటే కష్టమే అనుభవం ఖచ్చితంగా ఉండాలి ఉత్తరప్రదేశ్లో ఒక మహిళ బస్సు డ్రైవర్ గా తన బాధ్యతల్ని పూర్తి చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ మహిళ భర్త అదే బస్సులో బస్సు కండక్టర్ గా పనిచేస్తున్నాడు యూపీలోని బులంద్ షహర్ ప్రాంతంలో పాపులర్ అయిన ఈ జంట గురించి మరిన్ని వివరాలను చూద్దాం. ఈమె ఢిల్లీ NCRలో రద్దీగా ఉండే ఘజియాబాద్ పడౌన్ మార్గంలో బస్సు డ్రైవర్‌గా వర్క్ చేస్తున్నారు. ఈమె పేరు వేద్‌ కుమారి. ధైర్యంగా ఈమె డ్రైవర్‌గా బాధ్యతలు చేపట్టారు.

Also read:

ఆమె డిపోలో నుంచి బస్సును ప్రారంభించాక కౌశాంబి ప్రాంతం నుంచి బయలుదేరి, ఘజియాబాద్ చేరుకుని ఆ తరువాత బస్సులో పడౌన్ ప్రాంతానికి వెళ్తుంది. సంస్కృతంలో మాస్టర్స్ చేశారు. బస్సు డ్రైవర్‌గా ఉద్యోగం వచ్చింది. పోలీసు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూనే వున్నారు. బస్సు డ్రైవర్ నోటిఫికేషన్ చూసారు. ఆ తరవాత పోస్టుకు అప్లై చేసారు. సెలెక్ట్‌ అయిన అనంతరం వేద్‌ కుమారి ఉత్తరప్రదేశ్ రోడ్డు రవాణా శాఖ బస్సు డ్రైవర్‌గా శిక్షణ తీసుకున్నారు. 2021లో శిక్షణ తీసుకుంది. ఆ తర్వాత గత ఏప్రిల్ 2022లో కౌశాంబి డిపోలో విధానపరమైన శిక్షణ తీసుకున్నారు. ప్రభుత్వ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

 

You may also like

Leave a Comment