సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయిన “హనుమాన్” సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ స్థాయిలో కట్టిపడేసిందో చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న సినిమాగా రిలీజ్ అయిన హనుమాన్ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ సక్సెస్ సాధించింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా అమృత నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఎక్కడ చూసినా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గురించే చర్చలు నడుస్తున్నాయి. మరోవైపు ఈ సినిమా ఆర్ట్ వర్క్ గురించి కూడా చర్చ నడుస్తోంది. ఈ సినిమాలో అన్ని సన్నివేశాలు మనసుకు హత్తుకునేలా ఉంటాయి.
ఇటీవల ఈ సినిమాలో ఆర్ట్ వర్క్ కోసం పని చేసిన టి. నాగేంద్ర ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన హనుమాన్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. నాగేంద్ర మాట్లాడుతూ డైరెక్టర్ ఈ సినిమా స్టోరీ చెప్పినప్పుడే అంజనాద్రి కోసం ప్రత్యేకంగా సెట్ వెయ్యాలని అనుకున్నామని తెలిపారు. అందుకోసం వట్టినాగుల పల్లి వద్ద వ్యవసాయ భూముల్ని లీజుకి తీసుకున్నామని తెలిపారు. ఈ సెట్ కూడా ఫాంటసికి రియాలిటీకి దగ్గరగా ఉండేలా చూసుకున్నామని తెలిపారు.
అయితే.. హనుమంతుడి రక్త బిందువు నుంచి రుధిరమణి ఏర్పడే సన్నివేశానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని తెలిపారు. రామనామంతో వందకి రుధిరమణులను చేశామని.. వాటిలో ఒకడన్ ఫైనల్ చేశామని తెలిపారు. క్లైమాక్స్ సన్నివేశాల కోసం రామోజీ ఫిలిం సిటీ లోని మహర్షి సెట్ వాడుకున్నామని తెలిపారు. ఇక విలన్ సన్నివేశాలను డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్స్ లో షూట్ చేశామని తెలిపారు. బడ్జెట్ లిమిట్ గా ఉండడం వలనే ఈ సినిమాకు అన్ని పర్ఫెక్ట్ గా కుదిరాయని అన్నారు. ఇప్పుడు ఈ సినిమా మూడొందల కోట్ల గ్రాస్ ను రాబట్టిన సంగతి తెలిసిందే.