తెలుగు చిత్ర పరిశ్రమలోని బిగ్గెస్ట్ సూపర్ స్టార్లలో పవన్ కళ్యాణ్ ఒకరు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ మరో వైపు రాజకీయాల్లో కూడా దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పార్టిసిపేట్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో ఆయన వ్యక్తిగత జీవితం గురించి వార్తలు వస్తున్నాయి. ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకున్నారన్న సంగతి అందరికి తెలిసిందే. అయితే.. రేణు దేశాయ్, అన్న లెజినోవాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
కానీ, పవన్ కళ్యాణ్ మొదటి వైఫ్ గురించే ఎవ్వరికి తెలియదు. పవన్ కళ్యాణ్ ఆమెను ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ తీసుకుంటున్న సమయంలో కలిశారు. నందిని మోడల్ గా ఉండే వారు. వీరిద్దరూ పెళ్లి చేసుకున్న తరువాత 2008 లో విడిపోయారు. తమ వివాహా బంధాన్ని కొనసాగించలేకపోయారు. పెద్దలందరి సమక్షంలోనే వివాహం చేసుకున్న ఆ బంధాన్ని కొనసాగించలేకపోయారు. ఆ తరువాత రేణు దేశాయ్ తో పవన్ ప్రేమలో పడ్డారు. 2009 లో పెళ్లి చేసుకున్న వీరు మూడు సంవత్సరాలకే విడిపోయారు.
ఇది ఇలా ఉంటె.. పవన్ కళ్యాణ్ తో విడిపోయిన తరువాత మొదటి భార్య నందిని రెడ్డి తన పేరుని జాన్వీ గా మార్చుకున్నారట. అమెరికాకు చెందిన డాక్టర్ కృష్ణ రెడ్డిని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు. ఆమె భర్తకి దాదాపు రెండు కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయట.