Telugu News » డెవిల్ సినిమాలో స్టోరీ మొత్తం ఈ అమ్మాయి చుట్టూనే తిరుగుతుంది ! నేతాజీ పక్కన ఉన్న ఈమె ఎవరంటే?

డెవిల్ సినిమాలో స్టోరీ మొత్తం ఈ అమ్మాయి చుట్టూనే తిరుగుతుంది ! నేతాజీ పక్కన ఉన్న ఈమె ఎవరంటే?

నేతాజీ పక్కన ఉన్న ఈమె ఎవరంటే?

by Sri Lakshmi
subash-chandra-bose

కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన డెవిల్ సినిమా చూసారా? ఈ సినిమాలో హీరో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ మిలిటరీ ఏజెన్సీ కోసం పని చేస్తూ ఉంటాడు. కానీ అతను పని చేసేది నేతాజీ కోసమే అన్న ట్విస్ట్ సినిమా చివరి వరకు తెలియదు. ఈ సినిమాలో హీరో కళ్యాణ్ రామ్ పోషించిన పాత్ర ఓ మహిళ గూఢచారి ని స్ఫూర్తిగా తీసుకుని రూపొందించారని మీకు తెలుసా? ఆమె ఎవరో కాదు. ఆమె పేరు సరస్వతి రాజమణి. ఈమె నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు రైట్ హ్యాండ్. అంతే కాదు ఆమె భారత దేశ మొట్ట మొదటి మహిళా గూఢచారి కూడా.

నేతాజీ సుభాష్ చంద్ర బోస్ కోసమే పని చేసిన ఆమె బ్రిటిష్ వారి రహస్యాలను తెలుసుకోవడం కోసం బ్రిటిష్ మిలిటరీ స్థావరంలో ఓ కార్మికుడిగా మారు వేషంలో పని చేసింది. ఆమెతో పాటు తన స్నేహితులను కూడా గూఢచారులుగా ఎన్ఐఎన్ లో చేర్చి నేతాజీ కోసం పని చేసారు. 16 సంవత్సరాల వయస్సులో, కెప్టెన్ లక్ష్మీ స్వామినాధన్ (సాహగల్) నేతృత్వంలోని ఝాన్సీ రెజిమెంట్‌కు సరస్వతి రాజమణి అతి పిన్న వయస్కురాలైన గూఢచారిగా ఉన్నారు.

కొన్ని సంవత్సరాల తరువాత 2వ ప్రపంచ యుద్ధం ఉధృతంగా ఉన్నప్పుడు, సుభాస్ చంద్రబోస్ తన INA కోసం సైనికులను నియమించుకోవడానికి రంగూన్ ను సందర్శించారు. రాజమణి ఆయన ప్రసంగాలను విని ఉద్వేగం చెంది తానూ బంగారు, వజ్రాల నగలు అన్నీ ఇచ్చింది. అది చూసిన బోస్ ఆమె వేశపూరితంగా మరియు అమాయకంగా చేసిందని ఊహించాడు. అందువల్ల, తిరిగి ఆమె నివసించే రాజభవనానికి వెళ్లి ఆ నగలను తిరిగి ఇచ్చేసాడు.

బంగారపు వ్యాపారి నవ్వుతూ మౌనంగా ఉండిపోయాడు. కానీ అతని చిన్న కుమార్తె ఆవేశపడి, ఆ నగలు నిజంగా తనవేనని, ఒక గొప్ప పని కోసం విరాళం ఇచ్చే హక్కు తనకు ఉందని చెప్పి ఆ నగలను తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఆమెను చూసి ఆశ్చర్యపడిన బోస్ లక్ష్మి వస్తుంది పోతుంది. కానీ సరస్వతి అందరికి రాదు.. నీకు ఆ జ్ఞానం ఉంది. అందుకే నీకు సరస్వతి అని పేరు పెడుతున్నానని అన్నాడు. ఆమెను తన సైన్యంలో చేర్చుకున్నాడు. అప్పటి నుంచి ఆమె చంద్రబోస్ కు రైట్ హ్యాండ్ గా మారారు. ఈమె రియల్ స్టోరీ నే స్ఫూర్తిగా తీసుకుని డెవిల్ స్టోరీ రాసుకున్నారు.

You may also like

Leave a Comment