Telugu News » IPL 2024: ఐపీఎల్ జెర్సీలపై ఆ కలర్స్ బ్యాన్.. కారణమేంటో చెప్పిన హీరోయిన్..!

IPL 2024: ఐపీఎల్ జెర్సీలపై ఆ కలర్స్ బ్యాన్.. కారణమేంటో చెప్పిన హీరోయిన్..!

పంజాబ్ కింగ్స్​ జెర్సీ రంగును బీసీసీఐ(BCCI) బ్యాన్ చేసింది. తాజా సీజన్ కోసం తమ పాత జెర్సీని మార్చి కొత్తది తీసుకురావడంపై బాలీవుడ్ నటి ప్రీతిజింటా(Bollywood actress Preetijinta) పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది.

by Mano

ఐపీఎల్-2024(IPL-2024) కోసం పంజాబ్ కింగ్స్​ కొత్త జెర్సీ(New Jersey)ని ఈ మధ్యే ఆవిష్కరించింది. అయితే ఆ జెర్సీ రంగును బీసీసీఐ(BCCI) బ్యాన్ చేసింది. తాజా సీజన్ కోసం తమ పాత జెర్సీని మార్చి కొత్తది తీసుకురావడంపై బాలీవుడ్ నటి ప్రీతిజింటా(Bollywood actress Preetijinta) పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఐపీఎల్ ప్రారంభానికి ముందే పంజాబ్ కింగ్స్ కొత్త జెర్సీని రీసెంట్​గా చండీగఢ్​లోని ఎలాంటే మాల్‌లో విడుదల చేసింది.

IPL 2024: The reason behind the ban on colors on IPL jerseys..

ఈ కార్యక్రమంలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్, జట్టు యజమాని ప్రీతి జింటా కూడా పాల్గొన్నారు. 2009 నుంచి 2013 వరకు రెడ్ అండ్ గ్రే కలర్ మిక్సింగ్​తో ఉన్న తమ పాత జెర్సీని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ఎందుకు బ్యాన్ చేసిందో ప్రీతి జింటా వివరించింది.  వైట్ అండ్ గ్రే సిల్వర్ మిక్సింగ్ కలర్​ బాల్ కలర్​ను పోలి ఉండటంతోనే బీసీసీఐ తమ పాత జెర్సీని నిషేధించిందని తెలిపింది.

అదేవిధంగా ఇతర ఫ్రాంఛైజీలు కూడా తమ జెర్సీలపై ఈ రంగులు ఉండకుండా ఉండేలా బీసీసీఐ నిర్ణయం తీసుకుందని చెప్పింది. అందుకే తమ ఫ్రాంచైజీ పాత జెర్సీ కలర్​ను మార్చాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు కొత్త జెర్సీ పూర్తిగా రెడ్ కలర్​లోకి మారినట్లు తెలిపింది. ఈ రెడ్ కలర్ జెర్సీనే ధరించి తమ ఆటగాళ్లు మైదానంలోకి అడుగుపెట్టనున్నట్లు చెప్పింది. ఈ లీగ్​లో పంజాబ్ కింగ్స్ రాణించాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.

కాగా, ఐపీఎల్ మార్చి 22న ప్రారంభం కానుంది. మెగా లీగ్​ మొదటి మ్యాచ్​లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తలపడనున్నాయి. మార్చి 23న మొహాలీలోని మహారాజా యదవీందర్ సింగ్ ఇంటర్నేషన్ క్రికెట్ స్డేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్​తో పంజాబ్ కింగ్స్ బరిలోకి దిగుతోంది. ఐపీఎల్ 2024 సీజన్ వేలంలో పంజాబ్ కింగ్స్ చాలా మంది ఆటగాళ్లను జట్టులోకి చేర్చుకుంది. ఈ సీజన్​లో పంజాబ్ కింగ్స్ కచ్చితంగా ట్రోఫీని గెలుచుకుంటుందని ప్రీతి ఆశాభావం వ్యక్తం చేసింది.

You may also like

Leave a Comment