Telugu News » MLC Kavita: కులగణన తీర్మానం కంటితుడుపు చర్యే.. ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు..!

MLC Kavita: కులగణన తీర్మానం కంటితుడుపు చర్యే.. ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు..!

కులగణన తీర్మానం కేవలం కంటి తుడుపు చర్యేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Mlc Kavitha) అన్నారు. కులగణనకు అసెంబ్లీలో తీర్మానం సరిపోదని, చట్టబద్ధత కల్పించాల్సిన అవసరముందన్నారు.

by Mano
ISRO: Four more rocket launches in four months: ISRO Chairman

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Mlc Kavitha) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly)లో కులగణన తీర్మానంపై ఆమె స్పందించారు. ఈ తీర్మానం కేవలం కంటి తుడుపు చర్యేనని అభిప్రాయపడ్డారు. బంజారాహిల్స్‌లోని తన నివాసంలో శనివారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కవిత మాట్లాడారు.

ISRO: Four more rocket launches in four months: ISRO Chairman

కులగణనకు అసెంబ్లీలో తీర్మానం సరిపోదని, చట్టబద్ధత కల్పించాల్సిన అవసరముందని ఆమె అన్నారు. ఈ మేరకు ఆ చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అదేవిధంగా బీసీ సబ్ ప్లాన్‌కూ చట్టబద్ధత కల్పించాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. కాంగ్రెస్‌కు బీసీలు ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చారో రాహుల్ గాంధీ చెప్పాలన్నారు. రాహుల్ గాంధీ బాధ్యతలేని మాటలు మానుకోవాలని హితవుపలికారు.

కాంగ్రెస్ పార్టీది బీసీ వ్యతిరేక చరిత్ర అని ఆరోపించారు. ఆ పార్టీకి బీసీల పట్ల చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కులగణన ఎప్పటిలోగా పూర్తి చేస్తారో, ఎలా చేస్తారో ప్రభుత్వం చెప్పలేదని అన్నారు. స్పష్టత లేని కులగణన తీర్మానం బీసీలను మభ్యపెట్టే చర్య అని విమర్శించారు.

తలాతోకా లేని తీర్మానాన్ని తీవ్రంగా నిరసిస్తున్నామన్నారు ఎమ్మెల్సీ కవిత. బీహార్, కర్ణాటక రాష్ట్రాల్లో కులగణన చేపట్టే ముందు చట్టం చేశారని తెలిపారు. మండల్ కమిషన్ సమయంలో పార్లమెంటులో రాజీవ్ గాంధీ బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడారని గుర్తుచేశారు. 2011లో యూపీఏ హయాంలో చేసిన కులగణన నివేదికను ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు.

You may also like

Leave a Comment