సీనియర్ ఎన్టీఆర్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు ఎన్టీఆర్ ఎన్నో రకరకాల పాత్రలు పోషించి మంచి పేరుని తెచ్చుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమంలో నందమూరి తారకరామారావు చెరగని ముద్ర వేసుకున్నారు. పౌరాణిక, సాంఘిక, జానపద చిత్రాల్లో నటించి ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలని గెలుచుకున్నారు. విలక్షణమైన నటనతో నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు అన్నగారు. దేశవ్యాప్తంగా కూడా తెలుగు హీరో అయినా కూడా క్రేజ్ ని సంపాదించుకున్నారు. సినిమాల్లో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. తర్వాత రాజకీయాల్లోకి కూడా వచ్చారు. రాజకీయాల్లో కూడా అన్న గారు చెరగని ముద్ర వేసుకున్నారు. ప్రాంతీయ పార్టీ స్థాపించి జాతీయ నాయకులకు వణుకు పుట్టించేలా మారారు. ఇది ఇలా ఉంటే అన్నగారు ఎందుకు ఆయన పేరుని మనవడికి పెట్టారు..? దానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.
నందమూరి ఫ్యామిలీ లో ఎన్టీ రామారావు తర్వాత ఆయన నట ప్రస్తానాన్ని బాలకృష్ణ కొనసాగించిన విషయం తెలిసిందే. బాలయ్య తన జనరేషన్లో స్టార్ హీరోగా రాణిస్తున్నారు. బాలయ్య తర్వాత మళ్ళీ అంత క్రేజ్ జూనియర్ ఎన్టీఆర్ కి మాత్రమే వచ్చింది. ఎన్టీఆర్ పోలికలు తాతలా ఉంటాయి నటనలో కూడా తాతకి తగ్గ మనవడు అనిపించుకోవడంలో బాలయ్య కంటే కూడా ఎన్టీఆర్ కి క్రేజ్ ఉంది. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి టిడిపి పార్టీని అధీనంలోకి తీసుకోవాలని కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఈ స్థాయికి చేరుకుంటారని ఎన్టి రామారావు ఎప్పుడో ఊహించారు.
Also read:
అంతేకాకుండా తన పేరుని ఎన్టీఆర్ కి పెట్టారు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్టీఆర్ బాల రామాయణంతో పాటుగా మరికొన్ని సినిమాల్లో కూడా నటించారు. ఎన్టీఆర్ కి 11 ఏళ్ళు ఉన్నప్పుడు అబిడ్స్ లో ఉంటున్న ఎన్టీ రామారావు వద్దకి హరికృష్ణ తీసుకువెళ్లారు. అప్పుడు రామారావు దగ్గరికి తీసుకుని నీ పేరేంటి అని అడిగితే తారక్ రామ అని చెప్పారు దాంతో హరికృష్ణ ని తారక్ రామ అని ఎందుకు పెట్టావ్ అని అడిగితే అమ్మ పేరు రాముడి పేరు కలుస్తుందని పెట్టానని చెప్పారట. దాంతో ఎన్టీ రామారావు నా మనవడు నా పోలికలతో ఉన్నాడు. నా అంశ జీవితంలో గొప్పవాడు అవుతాడు అని తారక రామారావు గా పేరు మార్చేశారు.