Telugu News » Kadiyam Srihari : కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ కీలక నేతలు..!

Kadiyam Srihari : కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ కీలక నేతలు..!

ఇప్పటికే పలువురు కీలక ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ఇతర నేతలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్, బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో కడియం, ఆయన కూతురు సైతం పార్టీ వీడుతామని వెల్లడించారు.

by Venu

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది బీఆర్ఎస్​కు వరుసగా నేతలు షాకిస్తున్నారు.. ఇప్పటికే పలువురు నేతలు పార్టీ వీడుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా కడియం శ్రీహరి (Kadiyam Srihari), కావ్య (Kavya) గులాబీ పార్టీని వీడి నేడు కాంగ్రెస్‌లో చేరారు. హైదరాబాద్​ (Hyderabad)లో సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సమక్షంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ కాంగ్రెస్ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.

ఇప్పటికే పలువురు కీలక ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ఇతర నేతలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్, బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో కడియం, ఆయన కూతురు సైతం పార్టీ వీడుతామని వెల్లడించారు. ముందే ప్రకటించిన విధంగా ఇవాళ హస్తం గూటికి చేరారు. మరోవైపు వరంగల్ లోక్​ సభ స్థానం నుంచి కడియం శ్రీహరి లేదా కడియం కావ్యను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశముందని ప్రచారం మొదలైంది.

మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ వెళ్తున్నారు. పెండింగ్​లో ఉన్న కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ స్థానాలకు, హైకమాండ్​తో చర్చించి అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. ఇదిలా ఉండగా త్వరలో రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు సైతం కాంగ్రెస్‌ గూటికి చేరేందుకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. ఇక ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి దగ్గరగా ఉందని భావిస్తున్న నేతలు.. ఒడిపోయే పార్టీలో ఉండి లాభం లేదనుకొని తమ దారి తాము చూసుకొంటున్నట్లు చర్చలు వినిపిస్తున్నాయి..

ఇక కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను దక్కించుకునే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలో వలసలపై దృష్టి సారించిన పార్టీ.. ఎక్కువగా బీఆర్ఎస్ నేతలపై ఫోకస్ చేసి భారీగా చేరికలకు తెరతీసింది. ఈ సమయంలో కాంగ్రెస్ (Congress), తీరుపై బీఆర్ఎస్ (BRS) తీవ్రంగా విమర్శలు గుప్పిస్తోంది. పార్టీ మారుతున్న నేతలను రాళ్ళతో కొట్టాలని రేవంత్ అన్నట్లుగా గులాబీ నేతలు ఆరోపణలు చేస్తూ విరుచుకు పడుతున్నారు..

You may also like

Leave a Comment