బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రస్తుతం ఎమర్జెన్సీ (Emergency) అనే సినిమాని తెరకెక్కిస్తోంది. ఈ మూవీకి కంగన స్వయంగా దర్శకత్వం వహిస్తూ నిర్మాతగా వ్యవహరిస్తోంది. 1977 లో ఇందిరా గాంధీ (Indira Gandhi) ప్రైమ్ మినిస్టర్‌గా ఉన్న సమయంలో ఏర్పడిన ఎమర్జెన్సీ నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కుతోంది.
సొసైటీలో జరిగే కొన్ని సంఘటనల గురించి ముక్కుసూటిగా మాట్లాడుతూ నిత్యం కాంట్రవర్సీలలో నిలిచే కంగనా ఎమర్జెన్సీ వంటి సెన్సిటివ్ కంటెంట్‌ను ఎలా చూపించబోతుందో అని అందరిలో ఆసక్తి నెలకుంది. ఈ మూవీ విడుదల గురించి ఆమె తాజాగా అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమాను మందుగా అనుకున్న సమయానికి నవంబర్ 24న విడుదల చేయడం లేదని పేర్కొంది.
కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ చేయనున్నట్లు స్పష్టం చేశారు. కాగా ఇటీవల చంద్రముఖి 2 సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది కంగనా. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడకపోయినప్పటికీ ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.