బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్(Kangana Ranaut)కు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. ఇటీవల విడుదలైన ‘రజాకార్: ది సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్’(‘Rajakar: The Silent Genocide of Hyderabad’) అనే తెలుగు సినిమా ట్రైలర్(Telugu movie trailer) ఆవిష్కరణ కార్యక్రమంలో కంగనా రనౌత్ పాల్గొంది.
ఈ సందర్భంలో ‘దేశప్రధాని కావాలనే కోరిక మీకెప్పుడైనా కలిగిందా?’ అని కంగనాను ఓ విలేకరి ప్రశ్నను సంధించారు. దానికి ఆమె మాట్లాడుతూ ‘నేను ‘ఎమర్జెన్సీ’ అనే సినిమా చేశాను. ఆ సినిమా చూసిన ఏ ప్రేక్షకుడూ నేను ప్రధాని కావాలని కోరుకోడు’ అని సూటిగా సమాధానమిచ్చింది.
గతేడాది ప్రారంభంలోనూ రాజకీయాలపై తన ఎక్స్ ఖాతాలో స్పందించి కంగనా. ‘నేను సున్నితమైన వ్యక్తిని. రాజకీయ రంగానికి చెందిన వ్యక్తిని కాదు. రాజకీయాల్లోకి రావాలని నన్ను చాలామంది అడిగారు. అయినా నేను అటువైపు వెళ్లలేదు’ అని ఆ ట్వీట్లో పేర్కొంది.
కంగనా స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మించిన ‘ఎమర్జెన్సీ’ చిత్రం జూన్ 14న విడుదల కానుంది. దివంగత భారతప్రధాని ఇందిరాగాంధీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో ఇందిరాగాంధీగా కంగనా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, మిలింద్ సోమన్, శ్రేయాస్ తల్పాడే, మహిమా చౌదరి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.