Telugu News » Kishan Reddy: కిషన్ రెడ్డి దీక్ష భగ్నం, అమిత్ షా ఫోన్

Kishan Reddy: కిషన్ రెడ్డి దీక్ష భగ్నం, అమిత్ షా ఫోన్

కిషన్ రెడ్డిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ లో పరామర్శించారు. కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటాన్ని కొనసాగించాలని సూచించారు. పోరాటానికి కేంద్ర పార్టీ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

by Prasanna
kishan reddy

హైదరాబాద్, రాష్ట్ర: నిరుద్యోగులకు తెలంగాణా (Telanagana) ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతూ ఇందిరా పార్క్ దగ్గర కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అనంతరం ఆయన్నిబీజేపీ (BJP) రాష్ట్ర కార్యాలయంలో వదిలిపెట్టారు. దీంతో కిషన్ రెడ్డి తమ పార్టీ కార్యాలయంలో దీక్షకు దిగారు. ఆయన రాత్రి నుంచి అక్కడే దీక్ష కొనసాగిస్తున్నారు. ఇవాళ ఉదయం 11గ‌ంలకు దీక్ష విరమించి.. మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడనున్నారు.

kishan reddy

9 ఏళ్ల పాలనలో కేసీఆర్ సర్కార్ ఉద్యోగులను మోసం చేసిందంటూ ధర్నా చౌక్ వద్ద కిషన్ రెడ్డి 24 గంటల ఉపవాస దీక్ష చేపట్టారు. కిషన్ రెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేసిన సందర్భంగా బీజేపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అప్పుడు కిషన్ రెడ్డికి ఛాతీపై స్వల్ప గాయమైంది.

ఆ తర్వాత కిషన్ రెడ్డిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ లో పరామర్శించారు. కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటాన్ని కొనసాగించాలని సూచించారు. పోరాటానికి కేంద్ర పార్టీ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. కిషన్ రెడ్డిని నిరాహరదీక్షను పోలీసులు భగ్నం చేయడం పట్ల పార్టీ ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా దీక్ష చేస్తుంటే భగ్నం చేస్తారా అని ప్రశ్నించారు. కేసీఆర్  నిరుద్యోగులకు చేస్తున్న మోసాన్నిబీజెపీ ఎండగడుతుంటే… తట్టుకోలేకపోతూ అరెస్టులు చేయిస్తున్నారని బండి విమర్శించారు. త్వరలోనే రజాకార్ల పాలన అంతం కాబోతుందన్నారు.

నేడు జిల్లా, మండల కేంద్రాల్లో నిరసనలకు తెలంగాణ బీజేపీ పిలుపునిచ్చింది. కిషన్ రెడ్డి దీక్షను భగ్నం చేయడాన్ని నిరసిస్తూ చేపడుతున్న ఈ నిరసనలకు నిరుద్యోగ యువత, విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుందని బీజేజీ పార్టీ తెలిపింది. నిన్న రాత్రి నుంచే రాష్ట్రంలోని చాలా చోట్ల  బీజేపీ శ్రేణులు ఆందోళనలు, నిరసనలను  చేపట్టాయి.

You may also like

Leave a Comment