Telugu News » Kishan Reddy: 2047 కల్లా భారత్ విశ్వగురు స్థానానికి చేరుకోవాలి: కిషన్ రెడ్డి

Kishan Reddy: 2047 కల్లా భారత్ విశ్వగురు స్థానానికి చేరుకోవాలి: కిషన్ రెడ్డి

2047 కల్లా భారత్ ప్రపంచంలో విశ్వగురు స్థానానికి చేరుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గ్యాన్ అనే నాలుగు అక్షరాలే బీజేపీ అజెండా(BJP agenda) అని ఆయన స్పష్టం చేశారు.

by Mano
Kishan Reddy: Bharat should reach Vishwaguru position by 2047: Kishan Reddy

2047 కల్లా భారత్ ప్రపంచంలో విశ్వగురు స్థానానికి చేరుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) ఆకాంక్షించారు. హైదరాబాద్‌(Hyderabad)లోని పార్టీ కార్యాలయంలో అభివృద్ధి చెందిన భారతానికి మన మోడీ గ్యారంటీ-మరోసారి మన మోడీ సర్కార్ పోస్టర్‌ను కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్యాన్ అనే నాలుగు అక్షరాలే బీజేపీ అజెండా(BJP agenda) అని ఆయన స్పష్టం చేశారు.

Kishan Reddy: Bharat should reach Vishwaguru position by 2047: Kishan Reddy

స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయినా దేశంలో మౌలిక వసతులు లేవని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మన తర్వాత స్వాతంత్య్రం సాధించుకున్న దేశాలు అభివృద్ధి చెందాయన్నారు. 2047 కల్లా భారత్ ప్రపంచంలో విశ్వగురు స్థానానికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. 2047లో అధికారంలో ఎవరు ఉంటారనేది ముఖ్యం కాదనీ.. ఆ సమయానికల్లా అభివృద్ధి చెందిన దేశంగా మారాలన్నారు.

నేడు భారత్ సాధిస్తున్న ప్రగతికి, మారుమూల ప్రాంతాల వరకు సంక్షేమ పథకాలు చేరుతున్న తీరుతో బీజేపీ(BJP) జెండాను చూడగానే ప్రజలే స్వచ్ఛందంగా ఇదే మన మోడీ గ్యారంటీ అని చెబుతున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. ఐదు విభాగాలుగా విజయ సంకల్ప యాత్ర సాగుతోందన్నారు. బీజేపీ సాధించిన ప్రగతిని ప్రజల ముందు ఉంచుతామని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.

పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ స్వతంత్రంగా 370 సీట్లు, మిత్రపక్షాలతో కలిసి ఎన్డీయే కూటమికి 400 సీట్లను చేరుకోవడమే లక్ష్యమని కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో మెజారిటీ సీట్లు సాధించి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ప్రజల భాగస్వామ్యం ఉండేలా చేపట్టిన విజయ సంకల్ప యాత్రకు రాష్ట్రవ్యాప్తంగా మంచి స్పందన వస్తోందని చెప్పారు.

దేశంలో అవినీతి రహిత ప్రభుత్వం ఉండాలన్నారు కిషన్ రెడ్డి. పెట్టుబడులకు గమ్యస్థానంగా భారత్ మారాలన్నారు. 2047 కల్లా భారతీయులు విద్య కోసం విదేశాలకు వెళ్లే పరిస్థితి ఉండకూడదని పేర్కొన్నారు. జీ అంటే గరీబ్ కల్యాణ్, వై అంటే యూత్, ఏ అంటే అగ్రికల్చర్, ఎన్ అంటే నారీ శక్తి అని అర్థమని వివరించారు. అలాగే వచ్చే ఎన్నికల్లో ఫిర్ ఏక్ బార్-మోడీ సర్కార్ నినాదంతో ముందుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు.

You may also like

Leave a Comment