Telugu News » Komati Reddy Venkat Reddy : హరీశ్ రావు చూపులు బీజేపీ వైపు.. వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

Komati Reddy Venkat Reddy : హరీశ్ రావు చూపులు బీజేపీ వైపు.. వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

కాళేశ్వరం కట్టించిన చీఫ్ డిజైనర్ కేసీఆర్ మేడిగడ్డకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. ఎంపీ అభ్యర్థులపై అంతర్గత సర్వే జరుగుతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. భువనగిరి నుంచి పోటీ చేయాలని రాహుల్ గాంధీని కోరానని చెప్పారు.

by Venu

తెలంగాణలో కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) నేతల మధ్య డైలాగ్ వార్ కాకపుట్టిస్తోంది. ఇప్పటికే హస్తం నేతలు బీఆర్ఎస్ నేతలపై విమర్శల వర్షం ఏకధాటిగా కురిపిస్తుండటం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వర్సెస్ మాజీ మంత్రి హరీశ్ రావు మధ్య రాజకీయ సమరం ఆసక్తికరంగా మారింది. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటవ తేదీనే జీతాలు చెల్లిచడంపై స్పందించిన కోమటిరెడ్డి.. హరీశ్ రావుపై విమర్శలు గుప్పించారు.

minister komatireddy venkat reddy accused kcr of cheating the unemployes

నాలుగు సంవత్సరాలుగా సమయానికి జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వ ఉద్యోగులను తిప్పలు పెట్టిన గత ప్రభుత్వం తప్పులను దాచి.. హరీష్ రావు (Harish Rao) జీతాలు ఎక్కడ అంటూ అడిగారు కదా.. చూడండి. ఇప్పుడున్నది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వమని అన్నారు. శనివారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkat Reddy) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

హరీశ్ రావుకు ఫ్లోర్ లీడర్ పదవి ఇవ్వకపోతే బీజేపీ (BJP)లోకి వెళ్తాడని నెన్సేషనల్ కామెంట్ చేశారు. కేటీఆర్ (KTR) ఇప్పటికీ కేసీఆర్ (KCR) చాటు కొడుకే అని సెటైర్ వేశారు. కేటీఆర్ మాదిరిగా తండ్రి పేరుతో రాజకీయాల్లోకి రాలేదని తెలిపిన వెంకట్ రెడ్డి.. తాను ఉద్యమాలు చేసి వచ్చానన్నారు. మేం జీరో బిల్ ఇచ్చినట్లుగా కేటీఆర్ కి జీరో నాలెడ్జ్ ఉందని విమర్శించారు. నాలెడ్జ్ లేని కేటీఆర్ గురించి మాట్లాడటం వృథా అని ఎద్దేవా చేశారు..

కాళేశ్వరం కట్టించిన చీఫ్ డిజైనర్ కేసీఆర్ మేడిగడ్డకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. ఎంపీ అభ్యర్థులపై అంతర్గత సర్వే జరుగుతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. భువనగిరి నుంచి పోటీ చేయాలని రాహుల్ గాంధీని కోరానని చెప్పారు. భువనగిరి, ఖమ్మం, నల్గొండలో దక్షిణాదిలో టాప్ మెజార్టీ వస్తుందని ఈసారీ మోడీ కంటే రాహుల్ గాంధీనే ఎక్కువ మెజార్టీతో గెలవబోతున్నారని జోస్యం చెప్పారు. యాదాద్రిని యాదగిరి గుట్టగా మారుస్తూ త్వరలో జీవో విడుదల చేస్తామని వెల్లడించారు..

You may also like

Leave a Comment