సినిమా పరిశ్రమలో కష్ట సుఖాలు, ఒడిదుడుకులను దాటుకుని వచ్చిన వారే విజేతలుగా నిలబడతారు. దీనికి బిగ్ బాస్ ఫేమ్ కౌశల్ నిదర్శనమని టాలీవుడ్ హీరో మంచు మనోజ్(Manchu Manoj) తెలిపారు. మణి దీప్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై కౌశల్(Koushal), లీషా ఎక్లైర్స్ (Leesha Eclairs) హీరో హీరోయిన్‌లుగా శంకర్ దర్శకత్వంలో సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం “రైట్” రూపొందించారు.
మలయాళంలో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో విడుదలై విజయవంతమైన ‘మెమోరీస్’ చిత్రాన్ని తెలుగులో ‘రైట్’ సినిమాగా రీమేక్ చేశారు. నిర్మాతలు లుకలాపు మధు, మహంకాళి దివాకర్‌లు సంయుక్తంగా నిర్మించారు. డిసెంబర్ 30న విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్, ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని ప్రసాద్ ల్యాబ్ లో ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా హీరో మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. స్వశక్తితో ఎదిగిన వ్యక్తి కౌశల్, తనకంటూ ఒక ఆర్మీనే రూపొందడం సామాన్యమైన విషయం కాదు. రైట్ మూవీ ట్రైలర్ బాగుందని, ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందని ఆశించారు. ప్రముఖ నటుడు విజయకాంత్ మృతిపై మంచు మనోజ్ సంతాపం వ్యక్తం చేశారు. మంచి రాజకీయ ఆలోచనలు ఉన్న వ్యక్తి అని, చెన్నైలో ఆయన ఇంటి ముందు 2, 3 వందల మంది వచ్చేవారిని, ఆకలితో వచ్చిని ఏ ఒక్కరినీ అన్నం పెట్టకుండా పంపక పోయేవారని గుర్తు చేసుకున్నారు.
హీరో కౌశల్ మాట్లాడుతూ.. నటుడిగా మంచి పేరు సంపాదించాలని 18 ఏళ్ల వయసులో రాజ కుమారుడు సినిమాతో పరిశ్రమకు వచ్చానని గుర్తుచేసుకున్నారు. 24 ఏళ్ల తరువాత బిగ్ బాస్ రూపంలో తనకు కలసి వచ్చిందని, తన కోసం ఒక ఆర్మీ తయారు కావడం అదృష్టమని అన్నారు. తన ఆర్మీ అందరినీ కలుసుకోవడానికి దాదాపు 8 నెలలు అన్ని ప్రాంతాలు తిరిగానన్నారు. తన తండ్రి 8 సార్లు ఆల్ ఇండియా బెస్ట్ యాక్టర్‌గా నిలిచినా గుర్తింపు రాలేదని, కానీ తన ఫ్యాన్స్ ఆదరణతో మంచి గుర్తింపు వచ్చిందన్నారు.