Telugu News » అన్నగారిని రాజకీయంగా అణిచివేయాలని కృష్ణ ఇలా చేసారా..?

అన్నగారిని రాజకీయంగా అణిచివేయాలని కృష్ణ ఇలా చేసారా..?

by Sravya
srntr

సీనియర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ కి మామూలు క్రేజ్ ఉండేది కాదు సినిమాలతో రాజకీయాలతో కూడా అన్నగారు ఎంతోమంది ప్రేక్షకులు హృదయాలని గెలుచుకున్నారు. సినిమాల నుండి రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత కూడా ఎన్టీఆర్ తన కళను వదిలిపెట్టలేదు విశ్వామిత్రుడు ప్రథమ పుత్రుడు ఆంధ్రుడు కనుక అప్పటికి మన దేశానికి ఆంధ్రదేశమని పేరు వచ్చిందని ఆయన చెప్తుండే వారు. రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాక కొంతకాలం తర్వాత ఎన్టీఆర్ బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా షూటింగ్ ప్రారంభించారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి సినిమాలో నటించడం ఏంటని విమర్శలు వినిపించినా కూడా వాటిని పట్టించుకోలేదు. ఎన్టీఆర్ బ్రహ్మర్షి విశ్వామిత్ర ప్రారంభోత్సవానికి జాతీయస్థాయి రాజకీయ నాయకులు కూడా వచ్చారు.

srntr

 

ఎన్టీఆర్ బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాకి పోటీగా 1989లో కృష్ణ హిందీలో ఒక సినిమా ని తీయాలని నిర్ణయించుకున్నారు అప్పటికే ఎన్టీఆర్ కృష్ణ మధ్య వార్ నడుస్తోందట కృష్ణాజిల్లా కి కానీ గుంటూరు జిల్లా కి కానీ ఎన్టీఆర్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ కృష్ణ పోటీ చేయాలని అనుకున్నారట. హిందీ సినిమా కోసం అమితాబ్ ని సంప్రదించారు కృష్ణ అప్పటికి చాలా సినిమాలు ఒప్పుకుని బిజీగా ఉన్నారు అందుకే ఈ సినిమాలో నటించలేనని కృష్ణ గారికి చెప్పేసారట. ఎన్టీఆర్ కి పోటీగా వచ్చే సినిమాలో అమితాబ్ హీరోగా నటిస్తే దీనికి దీటుగా ఉంటుందని రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని అమితాబ్ ని ఒప్పించారు.

Also read:

ఆ టైంలో ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్నారు పార్లమెంట్ ఎన్నికల దృష్టిలో ఉంచుకుని ఎన్టీఆర్ నిర్మిస్తున్న బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు ఆయన అనుకున్న టైంకి రిలీజ్ చేయలేకపోయారు ఎన్టీఆర్. ఆ ఎన్నికల్లో టిడిపి ఓడిపోయింది సినిమాని కూడా వాయిదా వేశారు ఈ సినిమా ఇప్పుడు అప్పుడే రిలీజ్ అవ్వదని కృష్ణ అనుకున్నారు, అందుకే డ్రాప్ చేసేసారు. 1991లో సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. సినిమాకి పోటీగా విడుదల చేయడానికి నిర్మాతలు వెనకడుగు వేశారు ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత నటించిన సినిమా కావడంతో క్రేజ్ వచ్చింది కానీ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.

You may also like

Leave a Comment