బిగ్ బాస్(Big Boss)ద్వారా బాలీవుడ్ పాపులర్ అయిన కృతి వర్మపై TDS రీఫండ్ స్కామ్ ఆరోపణలు వెల్లువెత్తాయి. రూ.263 కోట్ల కుంభకోణానికి సంబంధించి కృతి వర్మ సహా 14 మంది వ్యక్తులపై ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate)సమగ్ర చార్జిషీట్ దాఖలు చేసింది.
కృతి వర్మ మాజీ GST ఇన్స్పెక్టర్. అంతే కాదు ఆమె బిగ్ బాస్ మరియు MTV రోడీస్(MTV Roadies)వంటి పలు టీవీ షోలతో ఫేమ్ సంపాదించింది.భూషణ్ పాటిల్(Bhushan Patil), రాజేష్ శెట్టి(Rajesh Shetty) వంటి ఇతర నిందితులతో కృతివర్మకు సంబంధాలు ఉన్నట్లు ఛార్జిషీట్ పేర్కొంది.
కృతి వర్మ ఇటీవల గురుగ్రామ్‌లో రూ1.02 కోట్ల స్కామ్ డబ్బును ఉపయోగించి సంపాదించినట్లు నమ్ముతున్న ఆస్తిని విక్రయించింది.ఈ కుంభకోణం నుండి వచ్చిన నిధులు భూషణ్ అనంత్ పాటిల్ యాజమాన్యంలోని ‘M/s SB ఎంటర్‌ప్రైజెస్’లోని వివిధ బ్యాంకు ఖాతాలకు పంపిణీ చేయబడ్డాయి.
ఈ కుంభకోణంలో నిందితులు సంపాదించిన నిధులను లోనావాలా, ఖండాలా, కర్జాత్, పూణే, ఉడిపిలోని రియల్ ఎస్టేట్‌లో, పన్వెల్ మరియు ముంబైలోని విలాసవంతమైన ఫ్లాట్లలో ఉపయోగించారని అభియోగాలున్నాయి.
ఈ కేసులో ఆరోపించిన ప్రధాన సూత్రధారి మాజీ ఇన్‌కమ్ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్ తానాజీ మండల్ అధికారి, అతను RSA టోకెన్‌లు, ఉన్నత ర్యాంకింగ్ అధికారుల లాగిన్‌లను పొందినట్లు చెప్పబడింది..అయితే ఈ విషయం పై ఇండస్ట్రీలో పలు చర్చలు మొదలయ్యాయి. ఈ స్కామ్ గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.