Telugu News » Not gone : ఎక్కువ నిల్చుంటే మీ కాళ్లు కలర్ మారుతున్నాయా..! అయితే అదే.!?

Not gone : ఎక్కువ నిల్చుంటే మీ కాళ్లు కలర్ మారుతున్నాయా..! అయితే అదే.!?

హమ్మయ్య.. కరోనా కంట్రోల్ అయ్యింది. మూతులకు మాస్క్ లు పెట్టక్కర్లేదు. సామాజిక దూరం పాటించక్కర్లేదు. ముఖ్యంగా పోలీసులతో లాఠీ దెబ్బలు తినక్కర్లేదు అనిపిస్తుంది కదా.!?ఒక స్మాల్ అలెర్ట్..

by sai krishna

హమ్మయ్య.. కరోనా కంట్రోల్ అయ్యింది. మూతులకు మాస్క్ లు పెట్టక్కర్లేదు. సామాజిక దూరం పాటించక్కర్లేదు. ముఖ్యంగా పోలీసులతో లాఠీ దెబ్బలు తినక్కర్లేదు అనిపిస్తుంది కదా.!?ఒక స్మాల్ అలెర్ట్..కొన్నిసార్లు కొత్త వేరియంట్స్(Variants) కనిపిస్తున్నాయి.

కరోనా ఇన్ఫెక్షన్(Infection)నుండి కోలుకున్న చాలా మంది వ్యక్తులు చాలా కాలంగా లక్షణాలను అనుభవిస్తున్నారు. వైద్యులు దీనిని లాంగ్‌ కోవిడ్‌గా పేర్కొన్నారు . ఈసారి దీర్ఘకాల కోవిడ్‌తో బాధపడుతున్న రోగుల పట్ల వైద్యులు-పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ మేరకు ఇటీవల లాన్సెట్ జర్నల్‌(Lancet Journal)లో ఒక అధ్యయనం ప్రచురించబడింది. దీర్ఘకాల కోవిడ్ ఉన్న రోగి కేవలం 10 నిమిషాలు నిలబడితే.. ఆ తర్వాత నీలం రంగులోకి మారిపోతున్నట్టుగా గుర్తించారు.

పరిశోధనా నివేదిక మేరకు…33 ఏళ్ల వ్యక్తి శరీరంలో ఈ వింత లక్షణం కనిపించింది. వైద్య పరిభాషలో దీనిని అక్రోసైనోసిస్(Acrocyanosis)అంటారు.కాలి సిరల్లో రక్తప్రసరణ(Circulation)అధికంగా జరగడం వల్ల కాసేపు నిలబడిన తర్వాత పాదాలు నీలం రంగులోకి మారుతాయి.


నిటారుగా నిలబడిన 1 నిమిషంలో వ్యక్తి కాళ్ళు ఎర్రగా మారడం, సమయం గడిచేకొద్దీ కాళ్ళు నీలం రంగులోకి మారడం గమనించారు. ఈ మార్పు సమయంలో కాళ్ళ సిరలు స్పష్టంగా కనిపిస్తాయి.


బ్రిటన్‌లోని లీడ్స్ యూనివర్శిటీ(University of Leeds)లో నిర్వహించిన ఈ అధ్యయనంలో 10 నిమిషాల పాటు నిలబడిన తర్వాత వ్యక్తి పాదాలు బరువుగా, దురదగా అనిపించినట్లు వెల్లడించింది. కానీ కూర్చున్న తర్వాత పాదాల రంగు, పరిస్థితి రెండు నిమిషాల్లో పూర్తిగా సాధారణంగా మారిపోయింది.

You may also like

Leave a Comment