లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) మరికొద్ది రోజుల్లో కొణిదెలవారి కోడలు కాబోతున్నారు. నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ ని పెళ్లాడబోతున్నారు. ఇటీవల నిశ్చితార్థం కూడా జరిగింది.
అయితే ఈ నేపథ్యంలో ఆమె సినిమాలు తగ్గించుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా మరో వెబ్ సిరీస్ కు కూడా నో చెప్పినట్టు సమాచారం.అయితే కొన్ని నెలల క్రితం కథ నచ్చటంతో ఆమె ఓ వెబ్ సిరీస్‌కి ఓకే చెప్పారు.
‘స్కైలాబ్(Skylab)’ అనే సినిమాను డైరెక్ట్ చేసిన విశ్వక్ ఖండేరావ్(Vishvak Khanderao) ఈ వెబ్ సిరీస్ డైరెక్ట్ చేయబోతున్నారు.కథాపరంగా ఇందులో హీరోయిన్ పాత్ర కాస్తంత బోల్డ్ గా ఉంటుందని తెలిసింది.
పైగా ఇంటిమేట్ సన్నివేశాల్లో కూడా నటించాల్సి ఉంటుందట. అందుకే ఆ వెబ్‌సిరీస్ దర్శక, నిర్మాతలను పిలిపించి మరొక హీరోయిన్ని చూసుకోమని చెప్పేశారట లావణ్య.
నిశ్చితార్థం అయిన తర్వాత ఇక నేను కొణిదలవారి కోడల్ని. ఇలాంటి కథల్లో నటించడం సబబుకాదని వారికి చెప్పి పంపించేశారట. ఈ విషయం తెలిసిన వారంతా లావణ్య నిర్ణయాన్ని అభినందిస్తున్నారు.