Telugu News » Liquor scam : జబర్దస్త్ కామెడీ స్కిట్ లా ఢిల్లీ లిక్కర్‌ కేసు.. ఈడీ నోటీసులపై స్పందన ఏది..?

Liquor scam : జబర్దస్త్ కామెడీ స్కిట్ లా ఢిల్లీ లిక్కర్‌ కేసు.. ఈడీ నోటీసులపై స్పందన ఏది..?

ఈడీ ఆఫీసులో మహిళలను విచారించ‌డం సరికాదంటూ కవిత లాయర్లు వాదించారు. నళిని, చిదంబరం తరహాలో తననూ ఇంటి దగ్గరే విచారించాలని కవిత సైతం డిమాండ్ చేశారు.

by Venu
Delhi-Liquor-Scam

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ (Delhi) లిక్కర్‌ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) పాత్ర ఉన్నదనే ఆరోపణలు తీవ్రంగా ప్రచారంలోకి వచ్చిన విషయం తెలిసిందే.. బీఆర్ఎస్ (BRS) అధికారంలో ఉన్నప్పుడు ఎలాగోలా లిక్కర్‌ కేసును నీరుగార్చారని విమర్శలు వచ్చాయి. అదీగాక చట్టంలోని లొసుగులు వాడుకొని కవిత బయటపడ్డారనే ప్రచారం జరిగింది.

Delhi-Liquor-Scam

ఈ క్రమంలో కవితకు మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నోటీసులు జారీ చేసింది. మంగళవారం విచారణకు హాజరుకావాలని ఈడీ (ED) తన నోటీసుల్లో స్పష్టం చేసింది. కవిత ఈడీ నోటీసులతో తెలంగాణ (Telangana) రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. అయితే గతంలోనూ కవితను మూడు సార్లు ఈడీ విచారించింది. ఆ సమయంలో ఈడీ నోటీసులు, విచారణ పద్ధతిపై సుప్రీం కోర్టును ఆశ్రయించారు..

ఈడీ ఆఫీసులో మహిళలను విచారించ‌డం సరికాదంటూ కవిత లాయర్లు వాదించారు. నళిని, చిదంబరం తరహాలో తననూ ఇంటి దగ్గరే విచారించాలని కవిత సైతం డిమాండ్ చేశారు. ఈ పిటిషన్‌పై స్పందించిన సుప్రీం కోర్టు.. మహిళ అయినంత మాత్రాన విచారించొద్దని చెప్పలేమని అభిప్రాయపడింది. అయితే మహిళల విషయంలో కొన్ని రక్షణలు కల్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

మరోవైపు ఇదే కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Kejriwal)కు ఈడీ నాలుగు సార్లు నోటీసులు ఇచ్చిన ఆయన స్పందించడంలేదు.. ఈ క్రమంలో ఆయనను అరెస్టు చేయాలా వద్దా అన్న దానిపై ఈడీ ఊగసలాడుతోంది. ఆయన సీఎం హోదాలో ఉన్నారు. ఆయనకు కొన్ని రాజ్యాంగ పరమైన రక్షణలు ఉంటాయి. అందుకే తటపటాయిస్తున్నారు. లేకపోతే సిసోడియా దగ్గరకే పంపించి ఉండేవారు. ఇప్పుడు కవిత కూడా ఈడీని అలాగే లైట్ తీసుకొంటున్నారని అనుకొంటున్నారు..

త్వరలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నవేళ ఈడీ నోటీసులు పంపడంపై ఇదొక రాజకీయ స్టంట్ గా భావిస్తున్నారని అనుకొంటున్నారు. ప్రస్తుతం ఈ కేసు పట్ల ఈడీ వ్యవహరిస్తున్న తీరు నవ్వులపాలు అవుతోందని టాక్ వినిపిస్తోంది.. టీవి సీరియల్ లా.. జబర్దస్త్ కామెడీ స్కిట్ లా ఈ కేసు ఇంకా ఎన్ని సంవత్సరాలు కొనసాగుతుందో అని రాజకీయాల్లో చర్చలు మొదలైనట్టు సమాచారం.. ఈ కేసుకు ముగింపు ఎలా ఉంటుందో అనే ఆసక్తి కూడా నెలకొన్నట్టు తెలుస్తోంది.

You may also like

Leave a Comment