Telugu News » BRS : బీటలు వారడానికి సిద్దంగా ఉన్న బీఆర్ఎస్‌.. కాంగ్రెస్ ను తక్కువ అంచనా వేశారా..?

BRS : బీటలు వారడానికి సిద్దంగా ఉన్న బీఆర్ఎస్‌.. కాంగ్రెస్ ను తక్కువ అంచనా వేశారా..?

బీఆర్ఎస్‌ లోకల్‌ లీడర్లు కాంగ్రెస్‌కు జై కొడుతూ.. సొంత పార్టీ నేతలపైనే అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టడం.. పలు చోట్ల బీఆర్ఎస్‌ కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌ గూటికి చేరుతున్న దృశ్యాలను చూస్తోన్న గులాబీ బాస్ లకు గుబులు మొదలైందని అంటున్నారు.

by Venu
brs congress

లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలంగాణ (Telangana) రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ కు ఊహించని షాకిచ్చిన జోష్ లో ఉన్న కాంగ్రెస్ నేతలు.. కారును గ్యారేజీకి పరిమితం చేయాలనే ఆలోచనలతో వ్యూహాలు రచించడంలో వేగం పెంచారని అనుకొంటున్నారు. ఇందులో భాగంగా పీసీసీ నేతలు.. గ్రౌండ్‌ లెవల్లోనూ పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది.

congress-leaders-are-criticizing-brs-leaders

అయితే ఇప్పటికే 10 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్‌ (BRS)కు షాక్‌ తగిలింది. మరో 18 మున్సిపాలిటీల్లోనూ అదే సీన్‌ రిపీట్‌ అయ్యే ఛాన్సుందని ప్రచారం జరుగుతోంది. అవిశ్వాస తీర్మానాలతో కార్పొరేటర్లు గులాబీకి ఆక్సిజన్ అందకుండా అడ్డుకొంటున్నారనే న్యూస్ ఇప్పటికే రౌండప్ చేస్తోంది. కారు సారు పదహారు అప్పుడు.. కారు సారు పంక్చర్ అనే ప్రస్తుత ట్రెండ్ దిశగా కాంగ్రెస్ (Congress) ముందుకు వెళ్తున్నట్టు ముచ్చటించుకొంటున్నారు.

మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections)12 నుంచి 14 ఎంపీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ పక్కా ప్లాన్‌తో అడుగులు వేస్తోందంటున్నారు.. ఈ క్రమంలో ఆరు గ్యారెంటీలను అస్త్రంగా భావిస్తోన్న హస్తం పార్టీ.. వాటి అమలు దిశగా వ్యూహాలు రచిస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంపు హామీలు అమల్లోకి వచ్చాయి. వచ్చే నెల నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అమలు చేయాలని భావిస్తున్నట్లు టాక్..

అదీగాక బీఆర్ఎస్‌ లోకల్‌ లీడర్లు కాంగ్రెస్‌కు జై కొడుతూ.. సొంత పార్టీ నేతలపైనే అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టడం.. పలు చోట్ల బీఆర్ఎస్‌ కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌ గూటికి చేరుతున్న దృశ్యాలను చూస్తోన్న గులాబీ బాస్ లకు గుబులు మొదలైందని అంటున్నారు. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఉడినట్లుగా బీఆర్ఎస్ పరిస్థితి మారుతోందనే ఊహాగానాలు మొదలైయ్యాయి.. కాంగ్రెస్ ను ఖాతం చేద్దామని భావిస్తే ఆ చక్రం తమ పని పట్టడంతో బీఆర్ఎస్ బీటలు వారడానికి సిద్దంగా ఉందని అనుకొంటున్నారు..

You may also like

Leave a Comment