సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ గా నిలిచిన సినిమా ఒక్కడు. ఈ సినిమాలో భూమిక హీరోయిన్ గా నటించారన్న సంగతి తెలిసిందే. గుణ శేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లోనే రికార్డ్స్ సృష్టించింది. అయితే.. ఈ సినిమా స్క్రిప్ట్ రాసుకుంటున్న టైం లో గుణ శేఖర్ మైండ్ లో ఉన్న హీరో వేరు. కానీ, చిరంజీవి సలహా మీదే గుణ శేఖర్ మహేష్ ను ఒప్పించి ఈ సినిమా చేసారు. ఈ సినిమాతో మహేష్ బాబు కెరీర్ దూసుకెళ్లిందనే చెప్పొచ్చు.
మృగరాజు సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో బ్రేక్ టైం లో గుణ శేఖర్ ఓ యూత్ ఫుల్ లవ్ స్టోరీ ని రాసుకునేవారట. ఈ స్టోరీ ని ఒకసారి గుణశేఖర్ మెగాస్టార్ కి వినిపించారు. అయితే.. మెగాస్టార్ ఈ స్టోరీ మహేష్ బాబుకి అయితే సరిపోతుంది. సినిమా బాగా హిట్ అవుతుంది అని చెప్పారట. కానీ, అప్పటికే గుణ శేఖర్ మైండ్ లో మరో హీరోని అనుకుంటూ ఉన్నారట.
ఆ విషయమే గుణ శేఖర్ మెగాస్టార్ చిరంజీవికి చెప్పారట. అయినా.. ఈ సినిమాకు మహేష్ బాబు అయితేనే సరిపోతాడని.. మహేష్ చేస్తేనే బాగుంటుంది అని మెగాస్టార్ చెప్పారట. దీనితో గుణ శేఖర్ ఆలోచనలో పడ్డారట. స్క్రిప్ట్ ను పూర్తిగా సిద్ధం చేసుకున్న తరువాత మహేష్ బాబుని కలిసారుట. ఈ సినిమా స్టోరీ చెప్పి.. రాయల సీమ బ్యాక్ గ్రౌండ్ లో కథ నడుస్తుంది.. మీరైతే బాగుంటారు అని చెప్పి మహేష్ ను ఒప్పించారట. అలా మహేష్ బాబు హీరోగా తీసిన ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మహేష్ బాబు సూపర్ స్టార్ గా ఎదగడానికి నాంది అయ్యింది. ఇలా ఓ రకంగా మహేష్ బాబు సూపర్ స్టార్ గా మారడంనికి మెగాస్టార్ కారణం అయ్యారు.