సూపర్ సార్ మహేష్ బాబు స్టార్ హీరోగా దూసుకు వెళ్ళిపోతున్నారు. మహేష్ బాబు గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. కృష్ణ కొడుకు గా ఇండస్ట్రీకి బాల నటుడుగా ఎంట్రీ ఇచ్చి, మహేష్ బాబు దూసుకు వెళ్ళిపోతూనే ఉన్నారు. తండ్రి కృష్ణ కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద హీరోగా పేరు తెచ్చుకుని ఎంతోమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు. మహేష్ బాబు ఆయన అడుగుజాడల్లో నడిచి ఎన్నో హిట్లని కొట్టేసి పాపులర్ అయిపోయారు. మహేష్ బాబు లానే ఇండస్ట్రీకి అన్నయ్య రమేష్ బాబు కూడా వచ్చారు.
కానీ పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. కొన్ని సినిమాలు తర్వాత నటనకి గుడ్ బై చెప్పేసారు. దురదృష్టవంశాత్తు ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఇది ఇలా ఉంటే మహేష్ బాబు తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన భార్య నమ్రత తో పాటుగా పాల్గొన్నారు. కెరియర్ గురించి పర్సనల్ విషయాలు గురించి కొన్ని విషయాలని పంచుకున్నారు. హీరో అవ్వడం అంత ఈజీ కాదని ఒత్తిడి ఉంటుందని సినిమా సక్సెస్ అయితే బాగుంటుంది కానీ ఫెయిల్ అయితే టెన్షన్, కోపం, చిరాకు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. అయితే విజయాలని అపజయాలని సమతుల్యంగా ఎలా ఎదుర్కోవాలి అనేది కృష్ణ తనకి నేర్పించినట్లు మహేష్ బాబు చెప్పారు.
Also read:
సినిమాలు సక్సెస్ అయినప్పుడు, వినయంగా కృతజ్ఞతతో ఉండాలని సినిమా టీం మొత్తానికి కూడా క్రెడిట్ ఇవ్వాలని.. మహేష్ బాబుకి తన తండ్రి కృష్ణ చెప్పారట. అలానే సినిమాల పరాజయాలకు బాధ్యత వహించాలని తప్పుల నుండి నేర్చుకోవాలని.. తన తండ్రి ఆయనకి నేర్పించినట్లు మహేష్ బాబు చెప్పుకొచ్చారు. ఇది ఇలా ఉంటే, మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో మన ముందుకి రాబోతున్నారు. ఈ సినిమా తర్వాత దర్శక ధీరుడు రాజమౌళితో మహేష్ బాబు ఒక సినిమా చేస్తున్నారు. మరి ఈ రెండు సినిమాలు మహేష్ బాబుకి ఎంతలా కలిసి వస్తాయి అనేది చూడాలి.