Telugu News » ‘బేబి’ ఫంక్షన్ కి చిరు పెట్టిన వాచ్ చాలా రిచ్ గురు..!

‘బేబి’ ఫంక్షన్ కి చిరు పెట్టిన వాచ్ చాలా రిచ్ గురు..!

by sai krishna

అభిమాన నటీనటులు ధరించే బట్టలు,షూలు,వాచ్ వగైరాలు..సోషల్ మీడియాలో ఆయా నటీనటుల కన్నా ఎక్కువ పాపులర్ అవుతున్నాయి. అవకాశం కుదిరిన వాళ్లు వీటిని కొనుగోలు చేస్తున్నారు కూడా…! ఉన్నపాటుగా సెలబ్రిటీ అయ్యే వీలుపడదు కాబట్టి.

వాళ్లు వేసుకున్న బట్టలో, వాచ్ లో వేసుకున్న తమలో తామే మురిసిపోతున్నారు. వాటితో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుని..అయినంత మేరకు ఫ్రెండ్స్ లోనూ,తెలిసిన వాళ్లల్లోనూ సెలబ్రిటీ అయిపోతున్నారు.ఇటీవల చాలా మంది సెలెబ్రటీలు వేసుకున్న వస్తువుల ప్రత్యేకతలు, వాటి ధరలు ట్రెండ్ అవుతున్నాయి..

తాజాగా చిరంజీవి ధరించిన వాచ్ ధర వైరల్ గా మారుతుంది. బేబీ సినిమా జులై 14 రిలీజ్ అయి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయిన చిరంజీవి తన మాటలతో అభిమానులను ఉల్లాస పరిచారు, బేబీటీమ్ కి మరింత హుషారు ఇచ్చారు. టీమ్ కూడా తక్కువేం హడావుడి చెయ్యలేదు..మెగాస్టార్ ని కుదిరినోళ్లు కుదిరినట్టుగా పొగడ్తలతో ఇచ్చిపడేశారు.

అది పక్కనబెడితే ఈ ఫంక్షన్ కి వచ్చిన చిరంజీవి..ధరించిన వాచ్ డీటెయిల్స్ వైరల్ గా మారాయి. మరీ ముఖ్యంగా చిరంజీవి పెట్టుకున్న వాచ్ అభిమానులకి తెగ నచ్చేసిందిట.ఈ క్రమంలోనే ఆ వాచ్ డీటెయిల్స్ వైరల్ చేస్తున్నారు అభిమానులు.

వాచ్ వివరాల ప్రకారం.. చిరంజీవి వాచ్ ఖరీదు దాదాపు 1.89 కోట్లుగా తెలుస్తోంది. అంటే ఓ లోబడ్జెట్ సినిమా తీసి ఓటీటీకి అమ్ముకోవచ్చు. స్థలం ఉంటే ఓ పది పదిహేను మంది పక్కాఇళ్లు కట్టుకోవచ్చు.

అయితే వాచ్ అంత ఖరీదు ఎందుకు వాచ్ గారి స్పెషల్ ఏంటని ఆరా తీస్తే.. ఇది ఎవరికి బడితే వాళ్లకి దొరకదట.దొరక్కపోవడం కూడా ఓ ప్రత్యేకతేమరి..! కోటీలో కొనుక్కునే దానికి ఎందుకు అంత విలువేం ఉంటుంది. ఎప్పుడో ఒకసారి మాత్రమే మార్కెట్ లో దొరుకుతుందట.

వాచ్ పేరు రోలెక్స్ కాస్మోగ్రాఫ్ డేటోనా ఐ ఆఫ్ ది టైగర్ వాచ్..చూశారా నోరు కూడా తిరగటం లేదు.! రేటు లాగే దీని పేరు కూడా అంత పొడవు . చాలా తక్కువ మంది సెలబ్రిటీస్ వద్ద ఉంటుంది.

ఈ వాచ్ ను చిరంజీవి ఇష్టంగా కొనుకున్నట్లు తెలుస్తుంది. ఈ వాచ్ ధర విన్న ఆయన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.. అంతేకాదు చిరంజీవి రేంజ్ అది అంటూ సంబరపడుతున్నారు..! మెగాస్టారా మజాకా..! ప్రస్తుతం చిరు భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నారు..

You may also like

Leave a Comment